AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. వ్యాపారులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి..

SBI Platinum Account: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాపారులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించింది.

SBI: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. వ్యాపారులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి..
Rupee
uppula Raju
|

Updated on: Dec 12, 2021 | 12:04 PM

Share

SBI Platinum Account: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాపారులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. SBI ప్లాటినం కరెంట్ ఖాతా తెరవడానికి అనుమతిస్తుంది. చిన్న వ్యాపారులు, నిపుణులు, వ్యాపారవేత్తలకు ఈ ఖాతా అనుకూలంగా ఉంటుంది. SBI ప్లాటినం ఖాతా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇటీవల SBI తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి SBI ప్లాటినం కరెంట్ ఖాతా ప్రయోజనాల గురించి ట్వీట్ చేసింది. మరిన్ని వివరాల కోసం sbi.co.in/web/business/sme/current-accountsని సందర్శించండి.

SBI అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ప్లాటినం కరెంట్ ఖాతా వ్యాపారానికి ఉత్తమమైనది. ఈ కరెంట్ ఖాతా అన్ని ప్రధాన సేవలను అన్‌లిమిటెడ్‌గా ఉచితంగా అందిస్తుంది. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహించవచ్చు. అదే ఇతర ఖాతాదారులకు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. వ్యాపారం చేసే వారు ఎస్బీఐలో చెల్లుబాటు అయ్యే KYC పత్రాలు అందించి కరెంట్ ఖాతాను ఓపెన్‌ చేయగలరు. ప్లాటినం కరెంట్ ఖాతా గురించి మరింత సమాచారం కోసం దయచేసి సమీపంలోని SBI శాఖను సంప్రదించండి లేదా sbi.co.inని సందర్శించండి.

ప్లాటినం కరెంట్ ఖాతా లక్షణాలు >> నెలవారీ సగటు బ్యాలెన్స్: రూ. 10,00,000 >> నెలకు రూ. 2 కోట్ల వరకు ఉచిత నగదు డిపాజిట్ >> హోమ్ బ్రాంచ్ నుంచి అపరిమిత నగదు విత్‌ డ్రా సౌకర్యం >> అపరిమిత ఉచిత RTGS & NEFT >> అపరిమిత ఉచిత మల్టీసిటీ చెక్ లీఫ్ >> అపరిమిత ఉచిత డిమాండ్ డ్రాఫ్ట్‌లు > > రోజుకు రూ. 2,00,000 విత్‌ డ్రా పరిమితితో ఉచిత ప్రీమియం, బిజినెస్ డెబిట్ కార్డ్ >> మొత్తం 22000 బ్రాంచ్‌లలో నగదు విత్‌ డ్రా & డిపాజిట్ సౌకర్యం >> సురక్షితమైన, వేగవంతమైన కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు ఉచిత యాక్సెస్ > > నామినేషన్ సౌకర్యం > > ఖాతా నిర్వహణ రుసుము: రూ 550 + GST >> కరెంట్ ఖాతా మూసివేత ఛార్జీలు 14 రోజుల వరకు – సున్నా >>14 రోజుల తర్వాత కరెంట్ అకౌంట్ క్లోజర్ ఛార్జీలు – రూ.1000 ప్లస్ GST >> నగదు పికప్: రూ.2 లక్షల వరకు ఉచితం

ఆదివారం సూర్య భగవానుడిని ఆరాదిస్తే ఆ దోషాలు తొలగుతాయి.. మరెన్నో ప్రయోజనాలు..

రజనీకాంత్ కోట్ల ఆస్తులకు యజమాని.. ఒక్క సినిమాకి ఎంత వసూలు చేస్తాడో తెలుసా?

ఈ రెండు పథకాలలో పెట్టుబడి.. రిటైర్మెంట్‌ తర్వాత మంచి రాబడి.. ఎలాగో తెలుసుకోండి..