ఈ రెండు పథకాలలో పెట్టుబడి.. రిటైర్మెంట్‌ తర్వాత మంచి రాబడి.. ఎలాగో తెలుసుకోండి..

Post Office: ఒక ఉద్యోగి రిటైర్మెంట్‌ విషయానికి వస్తే పోస్టాఫీసు రెండు పథకాలు చర్చలోకి వస్తాయి. ఈ పథకాల పేర్లు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్

ఈ రెండు పథకాలలో పెట్టుబడి.. రిటైర్మెంట్‌ తర్వాత మంచి రాబడి.. ఎలాగో తెలుసుకోండి..
Senior Citizen
Follow us
uppula Raju

|

Updated on: Dec 12, 2021 | 9:32 AM

Post Office: ఒక ఉద్యోగి రిటైర్మెంట్‌ విషయానికి వస్తే పోస్టాఫీసు రెండు పథకాలు చర్చలోకి వస్తాయి. ఈ పథకాల పేర్లు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లేదా POMIS, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లేదా SCSS. ఈ రెండు పథకాలలో మెరుగైన రాబడితో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగ సమయంలో ఈ పథకాల్లో డబ్బు పెట్టుబడి పెట్టేవారు రిటైర్మెంట్‌ తర్వాత ఖర్చుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఇది పన్ను ఆదా చేయడంలో సహాయపడుతుంది.

వృద్ధాప్యంలో ఉన్న సీనియర్ సిటిజన్ల అతిపెద్ద ఆందోళన రోజువారీ ఖర్చులు. ఈ ఆందోళన నుంచి బయటపడాలంటే ఉద్యోగం చేసేటప్పుడే పెట్టుబడి పెట్టాలి. ఉద్యోగంలో చేసే ఖర్చును వృద్ధాప్య ఖర్చుతో పోల్చుతూ పెట్టుబడి ఉండాలి. నెలవారీ ఆదాయం కొనసాగడం, ఖర్చులు సజావుగా సాగడంపై సీనియర్ సిటిజన్ల దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. దీని దృష్ట్యా, పోస్టాఫీసు పథకాన్ని ప్రయత్నించవచ్చు. ఈరోజు పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గురించి తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం పేరు సూచించినట్లుగా ఇది నెలవారీ ఆదాయం పథకం. ఇది పొదుపు పథకం అయిన భారత ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా నిర్వహిస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రతి నెలా స్థిర ఆదాయంతోపాటు రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక వ్యక్తి ఖాతాను తెరిస్తే జమ చేయగల గరిష్ట మొత్తం సంవత్సరానికి రూ. 4.5 లక్షలు. మీరు జాయింట్‌లో ఖాతాను తెరిస్తే డిపాజిట్ మొత్తం 9 లక్షల వరకు ఉండవచ్చు. ఇది అధిక వడ్డీ ఇచ్చే పథకం. ప్రస్తుతం వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే డిపాజిట్లపై పన్ను ఉండదు. అయితే 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిలో వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. మీరు పొదుపు ఖాతాకు రిటర్న్‌ను బదిలీ చేసుకోవచ్చు. దీని అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే మార్కెట్ ఒడిదొడుకులక ప్రభావితం కాని రాబడి.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లేదా SCSS ఇది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఈ పథకం ప్రయోజనాన్ని భారతదేశంలోని అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులలో పొందవచ్చు. సాధారణ డిపాజిట్ ఖాతాలతో పోలిస్తే ఈ పథకంలో అందించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇది 7.4 శాతం చొప్పున రాబడిని అందిస్తోంది. సాధారణ పొదుపు ఖాతాపై వడ్డీ రేటు 2.5 శాతంగా ఉంది. 1.5 లక్షల వరకు డిపాజిట్లపై పన్ను లేదు. ఈ సేవింగ్స్ స్కీమ్‌లో రూ. 500 నుంచి 1.5 లక్షల మధ్య పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడికి కనీస వయస్సు 58 సంవత్సరాలు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు దీనిని మరో మూడు సంవత్సరాలకు మాత్రమే పొడిగించవచ్చు.

CTET పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. ఎగ్జామ్స్‌ ఎప్పటి నుంచి అంటే..?

ఈ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు.. చాలా డబ్బు సంపాదిస్తారు.. మీరు ఈ జాబితాలో ఉన్నారా..

పరీక్షలంటే అందరికీ భయమే.. కానీ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..