పరీక్షలంటే అందరికీ భయమే.. కానీ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి..

Exam Tips: చిన్నపిల్లలైనా, పెద్దవారైనా పరీక్ష పేరు చెబితే అందరూ భయపడతారు. అయితే పిల్లల పరీక్షలకు, పెద్దల పరీక్షలకు చాలా తేడా ఉంది.

పరీక్షలంటే అందరికీ భయమే.. కానీ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి..
Board Exam
Follow us
uppula Raju

|

Updated on: Dec 12, 2021 | 8:11 AM

Exam Tips: చిన్నపిల్లలైనా, పెద్దవారైనా పరీక్ష పేరు చెబితే అందరూ భయపడతారు. అయితే పిల్లల పరీక్షలకు, పెద్దల పరీక్షలకు చాలా తేడా ఉంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు పరీక్షల్లో రాణించి మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని కోరుకుంటారు. అయితే పిల్లల పరీక్ష వారిదే కాదు తల్లిదండ్రులది కూడా. పిల్లల పరీక్ష ప్రారంభమైనప్పుడు తల్లిదండ్రులకు కూడా కొంత బాధ్యత ఉంటుంది. తద్వారా పిల్లలు పరీక్షలో రాణించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం చిన్న పిల్లల పరీక్ష నుంచి10-12 పరీక్షల వరకు అందరు టెన్షన్‌గా ఫీలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల్లో టెన్షన్‌ తగ్గించి వారిని చైతన్యవంతం చేయాలి. పరీక్షల సమయంలో వారికి మంచి విషయాలు చెప్పాలి. బాగా చదివేలా ప్రోత్సహించాలి. మీ పిల్లలు పరీక్ష గురించి ఒత్తిడికి లోనవుతున్నట్లయితే దాని నుంచి బయటపడటానికి ఎదో ఒకటి చేయండి. అప్పుడే వారికి మీరున్నారన్న ధైర్యం ఏర్పడుతుంది.

పిల్లల సమస్యలను అర్థం చేసుకోవడం పరీక్షల సమయంలో పిల్లలు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలకు అండగా నిలవాలి. వారి సమస్యలను వినండి పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నించండి. నేటి తల్లిదండ్రులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. వారు ఎంత బిజీగా ఉన్నా తమ పిల్లలతో కొంత సమయం గడపవచ్చు. ముఖ్యంగా పరీక్ష సమయంలో పిల్లలతో ఉంటూ వారి సమస్యలను అర్థం చేసుకోవాలి. ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచాలి.

పిల్లలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. తద్వారా వారి మనస్సు చదువులో నిమగ్నమై ఉంటుంది. ఎప్పుడూ టాపర్‌గా ఉండాలని పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు భిన్నమైన తెలివి కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరి సామర్థ్యాలు కూడా భిన్నంగా ఉంటాయి. మీ పిల్లలని ప్రోత్సహించండి విజయవంతమైన వ్యక్తుల పోరాటాల గురించి చెప్పండి. కానీ అతనిపై అది చేయండి ఇది చేయండని ఒత్తిడి మాత్రం చేయకండి.

ఈ 10 ఫైనాన్స్‌ కంపెనీలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి.. ఎంతంటే..?

Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ కరగాలంటే ఈ ఆహారాలు తినండి..! ఎందుకంటే..?

పాత నాణేలు నిజంగానే లక్షలు పలుకుతాయా..! వాటికి ఎందుకంత డిమాండ్‌..? కారణం ఇదే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!