LIC Scholarship 2021: విద్యార్థులకు శుభవార్త.. LIC స్కాలర్ షిప్‌కి అప్లై చేయండి.. ఏడాదికి రూ.20,000 పొందండి
LIC Scholarship 2021: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది సువర్ణవకాశమని చెప్పాలి. LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ 2020 విద్యా సంవత్సరంలో
LIC Scholarship 2021: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది సువర్ణవకాశమని చెప్పాలి. LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ 2020 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం గ్రేడ్‌తో X, XII లేదా తత్సమానం ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆల్ ఇండియా ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. అర్హత, ఆసక్తి ఉన్న ఆర్థికంగా బలహీన విద్యార్థులు డిసెంబర్ 31, 2021లోగా దరఖాస్తు చేసుకోవాలి. LIC స్కాలర్‌షిప్‌లలో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి LIC డివిజనల్ కేంద్రానికి రెగ్యులర్ స్కాలర్‌షిప్‌లు, ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు
LIC డివిజనల్ కేంద్రానికి రెగ్యులర్ స్కాలర్‌షిప్‌లు LIC డివిజనల్ కేంద్రానికి మొత్తం 20 సాధారణ స్కాలర్‌షిప్‌లు ఉంటాయి. ఇందులో బాలురకు 10, బాలికలకు 10 కేటాయిస్తారు. ఆర్థికంగా బలహీన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి వీటిని అందిస్తారు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఏదైనా రంగంలో డిప్లొమా కోర్సు, ఇంటిగ్రేటెడ్ కోర్సు, ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థలు లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలోవృత్తి విద్యా కోర్సులు చదివేవారికి అవకాశం ఉంటుంది.అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.20,000 అందజేస్తారు. 2020-21 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో (లేదా తత్సమాన గ్రేడ్) XII పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులందరూ LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు.
ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అర్హత కలిగిన బాలికలకు LIC ప్రతి డివిజన్ కేంద్రానికి మొత్తం 10 ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. అర్హులైన బాలికలకు సంవత్సరానికి రూ.10,000 అందజేస్తారు. 2020-21 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో (లేదా తత్సమానమైన గ్రేడ్) పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండేళ్లపాటు 10+2 పద్ధతిలో ఉన్నత చదువులు చదువుతున్న బాలికలు పొందేందుకు అర్హులు.
LIC స్కాలర్‌షిప్ కోసం ఇతర అర్హత ప్రమాణాలు వారి చివరి పరీక్షలో 60% మార్కులకు తగ్గకుండా సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.1,00,000 లోపు ఉండాలి. అభ్యర్థులు వారి మార్కులు, కుటుంబ ఆదాయం ఆధారంగా ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయం ఉన్న అర్హతగల విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. అభ్యర్థులు కోర్సు చివరి పరీక్షలో వరుసగా ఆర్ట్స్/సైన్స్/కామర్స్ లేదా తత్సమాన గ్రేడ్‌లో ప్రొఫెషనల్ స్ట్రీమ్స్, గ్రాడ్యుయేషన్ కోర్సులలో 55% కంటే ఎక్కువ మార్కులు సాధించాలి.
LIC స్కాలర్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు LIC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. LIC స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 31, 2021