ప్రయాణికుల కోసం అక్కడి రైల్వే స్టేషన్‌లో ఆ సేవలు ప్రారంభం.. సమయం ఆదా.. ఛార్జీలు తక్కువే..
Indian Railways: ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంటుంది. పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లను
Indian Railways: ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంటుంది. పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ప్రయాణికులు సుఖంగా ప్రయాణించేలా సౌకర్యాలు కల్పిస్తుంది. ఇదిలా ఉంటే దక్షిణ రైల్వే తిరుచ్చి రైల్వే స్టేషన్‌లో మొదటిసారి ఈ-బైక్ రెంటల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సౌకర్య కల్పించడం వల్ల ప్రజల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ అందుతోంది. రైల్వేలో ఇది పెద్ద హిట్‌గా చెబుతున్నారు.
సమయం ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఈ సేవలు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి. తిరుచ్చి జిల్లాలో ఇదే ఏకైక ఈ-బైక్ అద్దె సేవ. దీనిని దక్షిణ రైల్వేతో అనుసానిందించారు. ఇది ప్రస్తుతం గంట, రోజువారీ, వారం ప్రాతిపదికన ఈ-బైక్ అద్దె సేవలను కొనసాగిస్తున్నారు.
అద్దె ఎంత? ప్రస్తుతం ఈ-బైక్ కేంద్రంలో గంటకు రూ.50 చొప్పున ప్రజలకు అద్దెకు బైక్‌లను అందజేస్తున్నారు. అయితే కస్టమర్లు కూడా రూ.1000 సెక్యూరిటీగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆధార్ కార్డుతో, డ్రైవింగ్ లైసెన్స్ కాపీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ-బైక్ లక్షణాలు ఈ-బైక్‌లు GPS సదుపాయాన్ని కలిగి ఉంటాయి. దీని సహాయంతో వాటిని ఏ పరిస్థితిలోనైనా సులభంగా గుర్తించవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సదుపాయాన్ని పొందేందుకు మీరు రైలు ప్రయాణీకులు కానవసరం లేదు. రైలులో ప్రయాణించాల్సిన అవసరం లేదు. సాధారణ వ్యక్తి కూడా ఈ-బైక్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ-బైక్ సేవ ఒక్కసారి ఛార్జింగ్‌తో 130 కి.మీ వరకు ప్రయాణించగలరు.