ఆ తప్పు చేయవద్దు.. డబ్బులు పోగొట్టుకోవద్దు.. అలాంటి విషయాలపై జాగ్రత్త..
KYC Frads:మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత కూడా మారుతోంది. ప్రజలు కూడా వాటిని అనుసరిస్తున్నారు. అయితే
KYC Frads:మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత కూడా మారుతోంది. ప్రజలు కూడా వాటిని అనుసరిస్తున్నారు. అయితే వీటివల్ల చాలా ప్రయోజనాలు, కొన్ని అప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొంత కాలంగా మోసాల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలు, షాపింగ్, KYCని అప్‌డేట్ చేసే విషయంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జనాలను బురిడి కొట్టించి అందినకాడికి దోచుకుంటున్నారు. అందుకే బ్యాంకులు ఖాతాదారులకు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటాయి.
KYC పేరుతో కాల్ SMS వాస్తవానికి KYC అప్‌డేట్ తప్పనిసరి చేసినప్పటి నుంచి KYC పేరుతో ప్రజలకు నిరంతరం అనేక ఫోన్ కాల్‌లు, SMSలు వస్తున్నాయి. అంతే కాకుండా కేవైసీ అప్‌డేట్ కాకుంటే బ్యాంకు ఖాతా ఆగిపోతుందంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. మీకు అలాంటి సందేశాలు వస్తే తిరిగి రిప్లై ఇవ్వకండి. ఎటువంటి లింక్‌పై క్లిక్ చేయకండి.
సైబర్ హెచ్చరిక KYCకి సంబంధించిన మోసపూరిత SMS, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సామాజిక సైబర్ విభాగం ఒక ట్వీట్ చేసింది. ఇందులో బ్యాంక్ ఖాతా మూసివేత అనేది ఖాతాదారులను మభ్య పెట్టడానికి ఒక ఐడియా అని చెప్పారు. దీని కారణంగా మీరు మీ డబ్బును కోల్పోవచ్చు. కాబట్టి మీకు అలాంటి సందేశం వచ్చినప్పుడు ముందుగా అధికారిక నంబర్‌ను సంప్రదించండి. పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఫోన్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరికి షేర్ చేయకూడదని గుర్తుంచుకోండి అని ట్వీట్ ద్వారా తెలియజేశారు.
ఆ తప్పు చేయవద్దు బ్యాంకు ఖాతాకు సంబంధించిన మెసేజ్‌ని చూసిన తర్వాత ప్రజలు తరచుగా భయాందోళనలకు గురవుతారు. తనిఖీ చేయకుండానే తొందరపడి సమాచారాన్ని షేర్ చేస్తారు. KYCని అప్‌డేట్ చేసే ప్రక్రియలో సురక్షితం కాని యాప్‌ని డౌన్‌లోడ్ చేస్తున్నారు. అందుకే ఎక్కువగా మోసానికి గురవుతున్నారు. కాబట్టి ముందుగా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఆన్‌లైన్ యాక్టివిటీ పెరుగుదలతో ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేవలం ఒక తప్పుడు నిర్ణయం వల్ల కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం కోల్పోతున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండండి.