మీ వాట్సాప్‌కి ఇలాంటి మెస్సేజ్‌లు వచ్చాయా.. ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త.. చూసుకోండి..

Whatsapp Fraud: సైబర్‌ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అన్నీ సైబర్‌

మీ వాట్సాప్‌కి ఇలాంటి మెస్సేజ్‌లు వచ్చాయా.. ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త.. చూసుకోండి..
Whatsapp
Follow us

|

Updated on: Dec 11, 2021 | 4:19 PM

Whatsapp Fraud: సైబర్‌ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అన్నీ సైబర్‌ మోసాలకు గురువుతున్నాయి. ఇంటర్నెట్ ప్రపంచం పెరగడంతో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా మెసెంజర్ ప్లాట్‌ఫారమ్, వాట్సాప్‌లో కొత్త రకం మోసం హల్‌ చల్‌ చేస్తుంది. కాబట్టి వినియోగదారు దీని గురించి జాగ్రత్తగా ఉంటే మంచిది.

వాట్సాప్‌లో నడుస్తున్న కొత్త మోసం బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చింది . ఈ సైబర్ స్కామ్ WhatsApp మెస్సేజ్‌తో ప్రారంభమవుతుంది. ఇందులో సైబర్ నేరగాళ్లు ‘హలో మమ్’ లేదా ‘హలో డాడ్’ అని రాసి వినియోగదారుడికి సెండ్‌ చేస్తారు. తర్వాత మీ కొడుకు లేదా కూతురు ఇబ్బందుల్లో ఉన్నారని అత్యవసరంగా డబ్బు అవసరమని మరొక మెస్సేజ్‌ వస్తుంది. ఇలా UKలో కొన్ని నెలల్లో ప్రజల ఖాతాల నుంచి £50,000 వరకు డబ్బులు కొట్టేశారు.

మోసం ఎలా జరుగుతుంది? ఈ మెస్సేజ్‌లో తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు తమ పిల్లలకు డబ్బు అవసరమని గుర్తించేలా చేస్తారు. వారు ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా డబ్బులను డ్రా చేస్తారు. మొదటగా సైబర్‌ నేరగాళ్లు వారి పిల్లల పేరుతో మెస్సేజ్ పంపుతారు. ఫోన్ దొంగిలించారని, మరొకరి మొబైల్ నుంచి మెస్సేజ్‌ చేస్తున్నానని చెబుతారు. కొత్త ఫోన్ కొనాలన్నా, మొబైల్ బిల్లు కట్టాలన్నా డబ్బు అవసరం అని నమ్మిస్తారు. తల్లి లేదా తండ్రి ఈ మెసేజ్ చూసి షాక్ అయ్యి వెంటనే డబ్బు పంపుతున్నారు. ఇలా సైబర్‌ నేరగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ కొత్త సైబర్ ఫ్రాడ్‌లో నేరస్థులు సక్సెస్‌ అయిన తర్వాత మళ్లీ మళ్లీ ప్రయత్నించి అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బులు కాజేస్తున్నారు.

ఆగస్టు నుంచి అక్టోబర్ 25 మధ్య ఇటువంటి సైబర్ మోసాల ద్వారా £48,356 వరకు దోచుకున్నారు. బ్రిటన్‌లో లక్షలాది పౌండ్లు పోగొట్టుకున్న ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఆ డబ్బు తనకు తెలిసిన వారి వద్దకు వెళ్లలేదని, సైబర్ నేరగాళ్లు మోసం చేశారని తర్వాత తెలుస్తుంది. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది కాబట్టి ఇలాంటి మెసేజ్‌లు ఎవరికైనా రావచ్చు. సైబర్‌ నేరగాళ్లు ఎవరినైనా బలిపశువును చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.

చలికాలంలో ఈ 4 సమస్యలు విపరీతంగా బాధిస్తాయి..! జాగ్రత్తలు తీసుకోపోతే అంతే సంగతులు

చిన్నవయసులోనే జుట్టు తెల్లబడుతుందా..! కలర్ కాకుండా ఈ 2 సహజ పద్దతులు ట్రై చేయండి..

Iron Foods: శరీరంలో ఐరన్‌ స్థాయి పెంచడానికి ఈ 5 ఆహారాలు సూపర్.. అవేంటంటే..?