చలికాలంలో ఈ 4 సమస్యలు విపరీతంగా బాధిస్తాయి..! జాగ్రత్తలు తీసుకోపోతే అంతే సంగతులు

Winter Problems: చలికాలం రాగానే సీజనల్‌ వ్యాధులతో పాటు ఒంట్లో ఉన్న పాతరోగాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతాయి. వీటికి

చలికాలంలో ఈ 4 సమస్యలు విపరీతంగా బాధిస్తాయి..! జాగ్రత్తలు తీసుకోపోతే అంతే సంగతులు
Winter Problems
Follow us

|

Updated on: Dec 11, 2021 | 3:15 PM

Winter Problems: చలికాలం రాగానే సీజనల్‌ వ్యాధులతో పాటు ఒంట్లో ఉన్న పాతరోగాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతాయి. వీటికి తోడు జలుబు-దగ్గు, జ్వరం ఉంటూనే ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఎక్కువగా వ్యాధుల బారిన పడతారు. జలుబు, ఫ్లూ సమయంలో అలసట, నీరసం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఎక్కువగా వస్తాయి.

1. కీళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చలికాలపు రోజులు చాలా చెడ్డ రోజులని చెప్పవచ్చు. చల్లటి వాతావరణం వల్ల వారి సమస్య కూడా పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శీతాకాలంలో వాతావరణ పీడనం తగ్గడం వల్ల శరీరంలోని పెన్ గ్రాహకాలు మరింత సున్నితంగా మారుతాయి. దీని వల్ల కీళ్లలో వాపులు వచ్చి నొప్పి ఎక్కువవుతుంది. దీంతో ఆ వ్యక్తులు ఎక్కువగా బాధపడుతారు.

2. చెవి సమస్యలు చలికాలంలో చెవి మూసుకుపోవడం, దురదతో పాటు నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అధిక చలి కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ సమస్య ఉంటుంది. ఈ పరిస్థితిలో నొప్పి ఎక్కువ కాకముందే నిపుణుడిని సంప్రదించడం అవసరం. తగిన జాగ్రత్తలు పాటించాలి.

3. బ్రోన్కియోలిటిస్ చిన్నపిల్లలు, శిశువులకు బ్రోన్కియోలిటిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో శ్లేష్మం ఏర్పడుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

4. బలహీనమైన రోగనిరోధక శక్తి బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్యలు ఎదురవుతాయి. వీటిని నిరోధించడానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం అవసరం. ఎక్కువగా తులసి కషాయాలను తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా చేయాలి. చలి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులను ధరించాలి. బయటి ఆహారం తినడం మానుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినాలి.

చిన్నవయసులోనే జుట్టు తెల్లబడుతుందా..! కలర్ కాకుండా ఈ 2 సహజ పద్దతులు ట్రై చేయండి..

Iron Foods: శరీరంలో ఐరన్‌ స్థాయి పెంచడానికి ఈ 5 ఆహారాలు సూపర్.. అవేంటంటే..?

Wagon R Car: మారుతీ సుజుకి నుంచి ఎలక్ట్రిక్ వాగనార్‌ కారు..! విడుదల ఎప్పుడంటే..?

Latest Articles