Wagon R Car: మారుతీ సుజుకి నుంచి ఎలక్ట్రిక్ వాగనార్ కారు..! విడుదల ఎప్పుడంటే..?
Wagon R Car: చాలా వాహన కంపెనీలు ఇప్పుడు భారతదేశంలోని EVల పరిశ్రమలో పెట్టుబడులు పెడుతున్నాయి. చాలా పెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను
Wagon R Car: చాలా వాహన కంపెనీలు ఇప్పుడు భారతదేశంలోని EVల పరిశ్రమలో పెట్టుబడులు పెడుతున్నాయి. చాలా పెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడుతున్నాయి. దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన బ్రాండ్ మారుతీ సుజుకీ కూడా ఈ విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పెరుగుతున్న కాలుష్యం తగ్గించడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. మారుతి సుజుకి ఇండియా తన ప్రసిద్ధ కారు వాగన్ఆర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
కంపెనీ తన EV ప్లాన్‌లను 2018లోనే ప్రకటించింది 2020 నాటికి తన మొదటి EVని లాంచ్ చేయనున్నట్లు పేర్కొంది. కానీ పూర్తి చేయలేదు. అయితే తాజా నివేదిక ప్రకారం.. కంపెనీ 2024లో భారతదేశంలో తన మొదటి EV- వ్యాగన్ Rను తీసుకురావచ్చు. 2020లో ఆలస్యానికి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం, బ్యాటరీ ఖర్చు కారణమని కంపెనీ పేర్కొంది. అయినప్పటికీ టాటా మోటార్స్, MG మోటార్, హ్యుందాయ్ మోటార్ వంటి ఇతర ప్రధాన ఆటో కంపెనీలు తమ EVల రోడ్‌మ్యాప్‌ను 2028 నాటికి ప్లాన్ చేశాయి.
వ్యాగన్ R EV త్వరలో విడుదల 2025 నాటికి వాగన్ ఆర్ EVని లాంచ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తోషిబా, డెన్సోతో కలిసి సుజుకి జాయింట్ వెంచర్ ప్లాన్ చేసింది. గుజరాత్‌లో రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారతదేశపు మొట్టమొదటి లిథియం-అయాన్ సెల్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ట్రయల్ ప్రొడక్షన్ జరుగుతోంది. కార్ల తయారీదారులు బ్యాటరీ టెక్నాలజీలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. భవిష్యత్తులోని కార్ల కోసం బ్యాటరీలను తయారు చేయడానికి ఇతర OEM లకు అందించడానికి తోషిబా, డెన్సోతో భాగస్వామ్యం కలిగి ఉన్నారని మారుతి సుజుకీ పేర్కొంది.