Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nasa: ఈ నెల12న ఆకాశంలో అద్భుతం.. గ్రీన్‌ కలర్‌ తోకచుక్క దర్శనం..70వేల ఏళ్ల తర్వాత భూమికి చేరువుగా..

Green Comet Leonard: డిసెంబర్ నెలలో అద్భుతం జరగబోతుంది. అంతరిక్షంలో అద్భుతం జరగనుంది. ఇలాంటి అద్భుతం మళ్లీ మన జీవితంలో దీన్ని చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే..

Nasa: ఈ నెల12న ఆకాశంలో అద్భుతం.. గ్రీన్‌ కలర్‌ తోకచుక్క దర్శనం..70వేల ఏళ్ల  తర్వాత భూమికి చేరువుగా..
Nasa
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2021 | 6:53 PM

Green Comet Leonard: డిసెంబర్ నెలలో అద్భుతం జరగబోతుంది. అంతరిక్షంలో అద్భుతం జరగనుంది. ఇలాంటి అద్భుతం మళ్లీ మన జీవితంలో దీన్ని చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇలాంటి అద్భుతం జరగానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ నెల 12న తోక చుక్క భూమిమీద వాసులకు దర్శనం ఇవ్వనుంది. అదీ గ్రీన్‌ కలర్‌ తోక చుక్క కావడంతో మరింత విశేషత సంతరించుకుంది. అంతేకాదు ఈ తోకచుక్కకీ ఓ తిమింగలానికీ సంబంధం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు .. వివరాల్లోకి వెళ్తే..

ఈ డిసెంబర్‌లో అంతరిక్షంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. 5 గ్రహశకలాలు భూమివైపు వస్తున్నాయి. అలాగే… డిసెంబర్ 12న లియోనార్డ్ తోకచుక్క భూమికి దగ్గరగా రానుంది. ఐతే… ఇది డిసెంబర్ నెలంతా ఆకాశంలో కనిపిస్తూనే ఉంటుంది. కానీ… స్పష్టంగా చూడాలంటే డిసెంబర్ 12నే చూడాలి. ఈ సంవత్సరంలో భూమిపై ఉన్నవారికి కనిపించే అత్యంత కాంతివంతమైన తోకచుక్క ఇదే. దీన్ని 2021 జనవరిలో గురుగ్రహం దగ్గర్లో ఉన్నప్పుడు కనిపెట్టారు. ఇది భూమికి దగ్గరగా వస్తున్నా… దీని టార్గెట్ మాత్రం సూర్యుడేనట. త్వరలోనే సూర్యుణ్ని చేరుకుని… సూర్యుని చుట్టూ ఓ రౌండ్ వేసి… తిరిగి తన గెలాక్సీవైపు వెళ్లిపోతుందట. సాధారణంగా తోకచుక్కలు పసుపురంగులో కనిపిస్తాయి. ఇది మాత్రం ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే రసాయనాలు మండుతూ… చుట్టూ గ్రీన్ కలర్ మెరుపులు వస్తాయి. తోక మొత్తం గ్రీన్ కలర్‌లోనే ఉంటుంది. ఇలాంటి గ్రీన్ కలర్ తోకచుక్క భూమికి దగ్గర్లో రావడం 70,000 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. ఈ తోకచుక్క జనవరి 3, 2022 నాడు సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది. ఆ సమయంలో ఇది అత్యంత కాంతివతంగా కనిపిస్తుంది. కాకపోతే చాలా చిన్నగా కనిపిస్తుంది.

ఈ తోకచుక్కను చూసిన వారు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎందుకంటే… ఇది మన పాలపుంత గెలాక్సీ నుంచి కాకుండా… మరో గెలాక్సీ నుంచి మన సూర్యుడి దగ్గరకు వస్తోంది. ఇలా వచ్చే సందర్భాలు చాలా తక్కువ. ఈ తోకచుక్కను మీరు చూడాలంటే… డిసెంబర్ 12న సూర్యోదయం కాకముందే… ఆకాశంలో తూర్పు-ఈశాన్య దిక్కువైపున… చూడాలి. బైనాక్యులర్ ఉంటే… దీన్ని తేలిగ్గా గుర్తుపట్టగలరు. ఇది గ్రీన్ కలర్‌లో ఉంటుంది కాబట్టి మీరు గుర్తించేందుకు వీలవుతుంది. అప్పుడు మిస్సైతే… రోజూ ఉదయం వేళ సూర్యోదయానికి 2 గంటల ముందు ఇది తూర్పు దిక్కులో కనిపిస్తుంది. ఈ తోకచుక్కకు ఓ తిమింగలంతో సంబంధం ఉంది. అది సముద్రంలో తిరిగే తిమింగలం కాదు. విశ్వంలో ఉండే తిమింగలం. ఈ తోకచుక్క NGC 4631 అనే గెలాక్సీ నుంచి వస్తోంది. ఈ గెలాక్సీ చూసేందుకు తిమింగలంలా ఉంటుంది. అందుకే దీన్ని తిమింగలం గెలాక్సీ అంటారు. అలాంటి గెలాక్సీ నుంచి వస్తున్న తోకచుక్క కావడం వల్ల లియోనార్డ్ తోకచుక్కపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తోపాటూ… ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

Also Read:  మైదానంలో జంట పాముల సయ్యాట.. తన్మయత్వంతో పెనవేసుకున్న పాముల వీడియో వైరల్..