దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం చెమటోడ్చుతున్న రోహిత్‌.. ప్రాక్టీస్‌ వీడియో చూస్తే అదిరిపోవాల్సిందే..

Rohit Sharma Video: కొత్తగా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా నియమితులైన రోహిత్ శర్మ శుక్రవారం ముంబైలో శిక్షణా సెషన్‌లో పాల్గొన్నాడు. భారత దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం చెమటోడ్చుతున్న రోహిత్‌.. ప్రాక్టీస్‌ వీడియో చూస్తే అదిరిపోవాల్సిందే..
Rohi Sharma
Follow us
uppula Raju

|

Updated on: Dec 10, 2021 | 7:56 PM

Rohit Sharma Video: కొత్తగా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా నియమితులైన రోహిత్ శర్మ శుక్రవారం ముంబైలో శిక్షణా సెషన్‌లో పాల్గొన్నాడు. భారత దక్షిణాఫ్రికా పర్యటన కోసం నెట్‌లో చెమటోడ్చాడు. ప్రస్తుతం ప్రాక్టీస్‌కి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో రోహిత్‌ని అభినందిస్తున్నారు. ఈ స్టార్ బ్యాటర్ పేస్, బౌన్స్ అందించే పిచ్‌పై త్రోడౌన్ స్పెషలిస్ట్‌లతో కలిసి పని చేయడం వీడియోలో మనం చూడవచ్చు.

దక్షిణాఫ్రికా సిరీస్‌ డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. టీమిండియా 3-టెస్టుల సిరీస్‌ ఆడనుంది. మహ్మద్ షమీ కూడా నెట్స్‌కి తిరిగి వచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మతో పాటు న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన హోమ్ సిరీస్ నుంచి అతనికి కూడా విశ్రాంతి కల్పించారు. స్టార్ ఓపెనర్ వద్ద ఇద్దరు త్రోడౌన్ స్పెషలిస్టులు బౌలింగ్ చేస్తుండగా రోహిత్ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. అతను నెట్స్‌లో మంచి డెలివరీలను వదిలివేయడంపై దృష్టి సారించడం మనకు కనిపిస్తుంది. మరోవైపు బెంగళూరులోని ఎన్‌సీఏలోని నెట్స్‌లో కుల్దీప్ యాదవ్‌కు షమీ బౌలింగ్ చేశాడు.

భారత T20I కెప్టెన్‌గా రోహిత్ శర్మ తన మొదటి సిరీస్‌ని 3-0 తేడాతో గెలిచాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు అజింకా రహానే ఎంపిక కాకపోవడంతో రోహిత్ భారత టెస్ట్ వైస్ కెప్టెన్‌గా నియమించారు. గాయం కారణంగా రహానే న్యూజిలాండ్‌ సిరీస్‌లో చివరి టెస్టును కూడా ఆడలేదు.రోహిత్ దక్షిణాఫ్రికాలో విరాట్ కోహ్లీకి డిప్యూటీగా ఉంటాడు. ఓపెనర్‌గా మంచి ఫామ్‌ను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ 2019లో ఓపెనింగ్ ప్రారంభించినప్పటి నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌లో చక్కటి పరుగులు చేస్తుండటం విశేషం.

దక్షిణాఫ్రికా VS భారత్ టెస్ట్ సిరీస్ పూర్తి షెడ్యూల్

1వ టెస్ట్ – డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్‌లో

2వ టెస్టు- జనవరి 3 నుంచి 7 వరకు జోహన్నెస్‌బర్గ్‌లో

3వ టెస్ట్ – జనవరి 11 నుంచి 15 వరకు కేప్ టౌన్‌లో

జ్ఞాపకశక్తి, కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే ఈ 5 ఆహారాలు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..?

వైట్‌ రైస్‌, బ్రౌన్‌ రైస్‌కి తేడాలేంటి..? వైట్‌రైస్‌ కంటే బ్రౌన్‌ రైస్‌ ఎందుకు మంచిది..?

గుడ్డు ఒక్కటే కాదు.. ఈ 5 ఆహారాలలో కూడా ప్రొటీన్లు పుష్కలం..