AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైట్‌ రైస్‌, బ్రౌన్‌ రైస్‌కి తేడాలేంటి..? వైట్‌రైస్‌ కంటే బ్రౌన్‌ రైస్‌ ఎందుకు మంచిది..?

Brown Rice: భారతదేశంలో ఎక్కువ మంది అన్నం తినడానికి ఇష్టపడతారు. కొంతమంది రోటీ తింటారు. అయితే అన్నంలో ఉండే క్యాలరీలు మనల్ని

వైట్‌ రైస్‌, బ్రౌన్‌ రైస్‌కి తేడాలేంటి..? వైట్‌రైస్‌ కంటే బ్రౌన్‌ రైస్‌ ఎందుకు మంచిది..?
Rice
uppula Raju
|

Updated on: Dec 10, 2021 | 5:34 PM

Share

Brown Rice: భారతదేశంలో ఎక్కువ మంది అన్నం తినడానికి ఇష్టపడతారు. కొంతమంది రోటీ తింటారు. అయితే అన్నంలో ఉండే క్యాలరీలు మనల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అన్నం తినడం వల్ల ఏడాదిపొడవునా మీ ఆరోగ్యంపై దాని ప్రభావం ఉంటుంది. అయితే అన్నం తినాలి కానీ బరువు పెరగకూడదనుకుంటే బ్రౌన్‌ రైస్‌ బెటర్‌. అది ఎలాగో తెలుసుకుందాం.

శీతాకాలంలో బరువు ఎందుకు పెరుగుతారు.. శీతాకాలంలో కోరికలను ఆపుకోవడం చాలా కష్టం. ఏది తిన్నా నిరంతరం కూర్చోవడం వల్ల అది జీర్ణం కాకుండా బరువు పెరుగుతారు. దీంతో పాటు హార్మోన్లలో మార్పులు, విటమిన్ డి లోపం మొదలైన కారణాల వల్ల కూడా బరువు పెరుగుతారు. చలికాలంలో క్యాలరీలు నిండిన వంటకాలు తినే వారు బరువు విపరీతంగా పెరుగుతారు.

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎలా మంచిది.. బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే ఎక్కువ పోషకాలను అందిస్తుంది. సాధారణంగా ప్రజల ఇళ్లలో తెల్ల బియ్యం మాత్రమే తయారు చేస్తారు. అయితే బ్రౌన్ రైస్‌లో ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.100 గ్రాముల వండిన బ్రౌన్ రైస్‌లో 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అదే 158 గ్రాముల వైట్ రైస్‌లో1 గ్రాము కంటే తక్కువ ఫైబర్ ఉంటుంది. బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ రెండూ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. చక్కెర ఉన్నవారు గోధుమ గింజలను మాత్రమే తీసుకోవాలి.

బరువు తగ్గడంలో బ్రౌన్ రైస్ ఎలా ఉపయోగపడుతుంది.. బ్రౌన్ రైస్ తీసుకోవడం చాలా మంచిది. నిజానికి ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆస్తమా, ఆర్థరైటిస్‌తో సహా అనేక వ్యాధులను ఎదుర్కొంటాయి.

బ్రౌన్ రైస్ కొవ్వును త్వరగా కరిగిస్తుంది శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో బ్రౌన్ రైస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. తక్కువ కేలరీల ఆహారం తీసుకునే వ్యక్తులు శుద్ధి చేసిన ధాన్యాలు తినే వారి కంటే వేగంగా పొట్టను తగ్గించగలరు.

గుడ్డు ఒక్కటే కాదు.. ఈ 5 ఆహారాలలో కూడా ప్రొటీన్లు పుష్కలం..

ఈ ఫేమస్‌ మహిళా క్రికెటర్‌ని గుర్తుపట్టారా..! ఐపీఎల్‌లో మార్పులు ముందుగానే ఊహించింది..

మీరు సెకండ్‌ హ్యాండ్‌ వాహనం కొంటున్నారా..! దాని ఇన్సూరెన్స్‌ వివరాలు ఆన్‌లైన్‌లో చెక్‌ చేయండి..