AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్డు ఒక్కటే కాదు.. ఈ 5 ఆహారాలలో కూడా ప్రొటీన్లు పుష్కలం..

Protein Foods: ప్రోటీన్స్‌ అనే మాట వచ్చిందంటే మొదటగా గుర్తుకువచ్చేది గుడ్డు. ఇందులో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. డైటీషియన్లు, ఫిట్‌నెస్ నిపుణులు

గుడ్డు ఒక్కటే కాదు.. ఈ 5 ఆహారాలలో కూడా ప్రొటీన్లు పుష్కలం..
Protein
uppula Raju
|

Updated on: Dec 10, 2021 | 4:19 PM

Share

Protein Foods: ప్రోటీన్స్‌ అనే మాట వచ్చిందంటే మొదటగా గుర్తుకువచ్చేది గుడ్డు. ఇందులో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. డైటీషియన్లు, ఫిట్‌నెస్ నిపుణులు రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి చాలాసార్లు గుడ్లను సిఫార్సు చేస్తారు.100 గ్రాముల ఉడికించిన గుడ్డులో13 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పరిమాణం. అయితే శాకాహారులు కూడా చాలా ఆహారాల ద్వారా ఈ ప్రొటీన్‌ని పొందవచ్చు. గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్లను అందించే శాఖాహార ఆహారాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజలలో ప్రొటీన్‌ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల గుమ్మడికాయ గింజలలో ఫైబర్, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ K, ఫాస్పరస్, జింక్‌తో పాటు 19 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తాయి.

2. శెనగలు: శెనగలు ప్రొటీన్‌కి మంచి మూలం. వీటిని ఎక్కువగా వీధి ఆహారాలలో వినియోగిస్తారు. ఉడకబెట్టి కూడా తింటారు.100 గ్రాముల శెనగలలో 19 గ్రాముల ప్రొటీన్‌ను ఉంటుంది. గరిష్ట ప్రయోజనాల కోసం రోటీలు, అన్నంతో కలిపి తింటే చాలా మంచిది.

3. కాటేజ్ చీజ్: కాటేజ్ చీజ్ లేదా పనీర్ అనేది శాకాహారుల ప్రత్యేక కూరలు అని చెప్పవచ్చు. రుచికరమైన పాల ఉత్పత్తులు. పనీర్‌లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పనీర్‌లో 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

4. గ్రీక్ పెరుగు: సాధారణ పెరుగుకు విరుద్ధంగా గ్రీకు పెరుగులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇందులో దాదాపుగా 23 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుంది. కొన్ని బెర్రీలు, బాదంపప్పులు, అరటిపండ్లతో కలిపి తింటే చాలా మంచిది.

5. సోయాబీన్స్: సోయాబీన్స్ అనేది ప్రోటీన్లకు మంచి మూలమని చెప్పవచ్చు. ఒక కప్పులో 29 గ్రాముల మాక్రోన్యూట్రియెంట్‌ను అందిస్తుంది. సోయాబీన్ ఉత్పత్తులను కూడా శాకాహారులు ఇష్టపడుతారు. ఇందులో ప్రొటీన్‌తో పాటుగా కాల్షియం  కూడా ఎక్కువగా ఉంటుంది.

ఈ ఫేమస్‌ మహిళా క్రికెటర్‌ని గుర్తుపట్టారా..! ఐపీఎల్‌లో మార్పులు ముందుగానే ఊహించింది..

Bird Flu in Kerala: కేరళలో మరోసారి బర్డ్‌ ఫ్లూ కలకలం.. కోళ్లు, పెంపుడు జంతువులను చంపాలని నిర్ణయం..

IPL 2022: సన్‌ రైజర్స్‌ ఈ ఆటగాడికి 40 కోట్లు చెల్లించింది.. కానీ జట్టు నుంచి విడుదల చేసింది.. కారణం ఏంటంటే..