IPL 2022: సన్ రైజర్స్ ఈ ఆటగాడికి 40 కోట్లు చెల్లించింది.. కానీ జట్టు నుంచి విడుదల చేసింది.. కారణం ఏంటంటే..
IPL 2022: IPL 2022 రిటెన్షన్‌లో అన్ని జట్లు తమ ఆటగాళ్లను రిటైన్ చేస్తుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్,
IPL 2022: IPL 2022 రిటెన్షన్‌లో అన్ని జట్లు తమ ఆటగాళ్లను రిటైన్ చేస్తుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌లను రిటైన్ చేసింది. రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో వంటి ఆటగాళ్లను విడుదల చేసింది. అయితే ఈ జట్టులో అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా పేరు సంపాదించిన రషీద్ ఖాన్‌ను విడుదల చేయడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. రషీద్ ఖాన్ గత ఐదేళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. ఈ లెగ్ స్పిన్నర్‌ను జట్టు నిలుపుకోలేదు.
మీడియా నివేదికల ప్రకారం..రషీద్ ఖాన్ డబ్బు కారణంగా సన్‌రైజర్స్‌ను విడిచిపెట్టలేదు. అసలు కారణం వేరే ఉంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ఈ లెగ్ స్పిన్నర్ డబ్బు కోసం జట్టును విడిచిపెట్టలేదు. రషీద్ ఖాన్ 2017 సంవత్సరంలో మొదటిసారిగా ఆర్సీబీతో జతకట్టాడు. అప్పటి నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ అతనికి రూ. 40 కోట్ల జీతం చెల్లించింది. అయితే రషీద్ ఖాన్‌ని డబ్బు కోసం కాకుండా జట్టులో వాతావరణం మార్చడానికి జట్టు నుంచి విడుదల చేశారని చెబుతున్నారు. ఇన్‌సైడ్ స్పోర్ట్ వార్తల ప్రకారం రషీద్ ఖాన్ కూడా కొత్త జట్టులో కొత్త వాతావరణంలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ సమయంలో రషీద్ ఖాన్‌ను జట్టులో కొనసాగించాలని అనుకుంది. కానీ కుదరలేదని ప్రకటించింది. అయితే ఈ లెగ్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఫ్రాంఛైజీ స్పష్టం చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో 76 మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్ 93 వికెట్లు సాధించాడు. రషీద్ ఖాన్ ఎకానమీ ఓవర్‌కు కేవలం 6.33 పరుగులు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో రషీద్ ఖాన్ ఏ జట్టుకు వెళ్లినా తనంతట తానుగా ఎన్నో మ్యాచ్‌లు గెలుస్తాడనేది వాస్తవం.