ఇతడికి వయసు అనేది నెంబర్‌ మాత్రమే..72 ఏళ్లున్న వ్యక్తి 30 ఏళ్ల యువకుడు.. కారణం ఇదే..

ఇతడికి వయసు అనేది నెంబర్‌ మాత్రమే..72 ఏళ్లున్న వ్యక్తి 30 ఏళ్ల యువకుడు.. కారణం ఇదే..
Body Builder

Body Builder: ప్రజలు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి వ్యాయామం చేయడం, జిమ్ చేయడం చేస్తారు. ప్రతి వ్యక్తి పరిపూర్ణంగా కనిపించాలని కోరుకుంటాడు.

uppula Raju

|

Dec 01, 2021 | 8:58 PM

Body Builder: ప్రజలు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి వ్యాయామం చేయడం, జిమ్ చేయడం చేస్తారు. ప్రతి వ్యక్తి పరిపూర్ణంగా కనిపించాలని కోరుకుంటాడు. అందుకు గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్లు చేస్తారు. ఇందుకోసం కొంతమంది స్టెరాయిడ్స్ కూడా వాడుతున్నారు. కానీ మీ శరీరాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచుకోవడం అంత తేలికైన పని కాదు. ఇది కృషి, అంకితభావంతో కూడుకున్నది. ఓపిక కూడా ఎక్కువగా ఉండాలి. అప్పుడు అతడికి ఏజ్‌ అనేది ఒక నెంబర్‌ మాత్రమే అవుతుంది. అందరికంటే చిన్నవాడిలా కనిపిస్తాడు.

ప్రస్తుతం 72 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక వ్యక్తి 30 ఏళ్ల యువకుడిగా కనిపిస్తున్నాడు. జిన్‌మిన్ యాంగ్‌ని మొదటి చూపులోనే చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. జిన్మిన్ తన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునే మొదటి బాడీబిల్డర్. 2019 సంవత్సరంలో కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అతని వీడియో కూడా వైరల్ అయ్యింది, అందులో అతను తనను తాను 30 ఏళ్ల వ్యక్తిలా అభివర్ణించుకున్నాడు. ఒక సమాచారం ప్రకారం.. జిన్మిన్ యాంగ్ దాదాపు 30 సంవత్సరాలు పనిచేశాడు. ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదంతా బాడీబిల్డింగ్ ఫలితమేనని, అందుకే దానిని చాలా గౌరవిస్తానని చెబుతాడు.

ఇప్పటివరకు జిన్మిన్‌కి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. అంటే అతను ఎంత ఫిట్‌గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇతడు యువకుడిలా ఫిట్ గా ఉన్నాడని ఇప్పటికీ చాలా మంది డాక్టర్లు నిర్ధారించారు. వెయిట్ లిఫ్టింగ్ తో పాటు అతని డైట్ కూడా చాలా ఆరోగ్యకరమైనది. అల్పాహారం కోసం ప్రతిరోజూ 6 నుంచి 8 గుడ్లు తింటాడు. దీనితో పాటు దోసకాయలు, చికెన్, టమోటాలు, వోట్మీల్ కూడా అతని ఆహారంలో ప్రధాన భాగం. ఈ రోజుల్లో అతను ఫిట్‌నెస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. బాడీబిల్డర్‌లకు వెయిట్‌లిఫ్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నాడు.

LIC Policyholders: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. పాన్‌కార్డ్‌ అప్‌డేట్‌ చేస్తే ఈ ప్రయోజనాలు

పెట్రోల్‌, డీజిల్ GST పరిధిలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఈ మార్పులు సంభవిస్తాయి..

Mphil PHD: ఎంఫిల్, పిహెచ్‌డి విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. థీసిస్ సమర్పణ తేదీ పొడగింపు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu