AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Policyholders: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. పాన్‌కార్డ్‌ అప్‌డేట్‌ చేస్తే ఈ ప్రయోజనాలు

LIC Policyholders: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) IPOను తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది రాకముందే పాలసీదారులకు

LIC Policyholders: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. పాన్‌కార్డ్‌ అప్‌డేట్‌ చేస్తే ఈ ప్రయోజనాలు
Lic Ipo
Follow us
uppula Raju

|

Updated on: Dec 01, 2021 | 4:13 PM

LIC Policyholders: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) IPOను తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది రాకముందే పాలసీదారులకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. అందరు వెంటనే పాన్‌కార్డ్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. తద్వారా ఐపీఓలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఎల్‌ఐసీ ప్రకటించింది. మొత్తం IPOలో 10 శాతం పాలసీదారుకు రిజర్వ్ చేస్తారు. కానీ పాన్ కార్డ్ అప్‌డేట్ అయినప్పుడే దాని ప్రయోజనం పాలసీదారులకు లభిస్తుంది.

IPOలో పాల్గొనడానికి పాలసీదారులు తమ పాన్‌కార్డ్‌ని LIC రికార్డులలో అప్‌డేట్ చేయాలని పబ్లిక్ నోటీసులో పేర్కొంది. ఇది కాకుండా దేశంలోని ఏదైనా పబ్లిక్ ఆఫర్‌లో పాల్గొనడానికి వినియోగదారుడు చెల్లుబాటు అయ్యే డీమ్యాట్ ఖాతాను కలిగి ఉండటం అవసరం. PANని అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే అది లేకుండా IPO కొనుగోలు చేయబడదు.

డీమ్యాట్ ఖాతా అవసరం డీమ్యాట్ ఖాతా గురించి కూడా LIC ప్రస్తావించింది. IPOలో వాటా తీసుకునే ముందు డీమ్యాట్ ఖాతాను కలిగి ఉండటం తప్పనిసరి. కస్టమర్ వద్ద ఈ ఖాతా లేకుంటే అతను తన సొంత ఖర్చుతో దీన్ని ప్రారంభించాలి. డీమ్యాట్ ఖాతా తెరవాలన్నా, పాన్ జారీ చేయాలన్నా, డీమ్యాట్ ఖాతా నిర్వహించాలన్నా లేదా ఇతర సంబంధిత ఖర్చులన్నీ ఖాతాదారులే భరించాల్సి ఉంటుంది. LIC అటువంటి ఖర్చులను భరించదు.

జూలై, 2021లో ఎల్‌ఐసిలో కొంత భాగాన్ని విక్రయించాలని (డిజిన్వెస్ట్‌మెంట్) కేంద్ర మంత్రివర్గం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత LIC తన IPO షేర్లతో ముందుకు వస్తుంది. LIC దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ కోట్లాది మంది వినియోగదారులను కలిగి ఉంది. ఎల్‌ఐసి ఎంత విక్రయించాలి లేదా ఎన్ని షేర్లను తొలగించాలి అనేదానిపై నిర్ణయించడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వం వహిస్తారు.

Airtel vs JIO vs VI: ధరలు పెరిగాక రూ. 200లోపు వచ్చే రీఛార్జ్‌ ప్లాన్‌లు ఇవే..!

ICC Test Rankings: టాప్‌ 10లోకి మెరుపులా దూసుకొచ్చిన పాకిస్తాన్ ప్లేయర్‌.. ఇండియన్స్‌ స్థానాలు ఎలా ఉన్నాయంటే..?

ముఖం ముడతలు పడుతుందని ఇబ్బందిపడుతున్నారా..! ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మెరిస్తే అందం మీ సొంతం..