Airtel vs JIO vs VI: ధరలు పెరిగాక రూ. 200లోపు వచ్చే రీఛార్జ్ ప్లాన్‌లు ఇవే..!
Airtel vs JIO vs VI: దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్-ఐడియా తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచాయి.
Airtel vs JIO vs VI: దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్-ఐడియా తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచాయి. Vodafone-Idea కొత్త ధరలు నవంబర్ 25న అందుబాటులోకి వచ్చాయి అయితే Jio తన పెరిగిన ధరలను 1 డిసెంబర్ 2021న దేశవ్యాప్తంగా అమలు చేసింది. అందుకే రూ. 200 లోపు వచ్చే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లలో అపరిమిత కాల్స్ అందుబాటులో ఉన్నాయి.
200 లోపు జియో రీఛార్జ్ రిలయన్స్ జియోలో రెండు రీఛార్జ్ ప్లాన్‌లు రూ.200 కంటే తక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు, రూ.199 రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్‌లను పొందేవారు. కానీ ఇప్పుడు రూ.199 ప్లాన్‌లో వినియోగదారులు 23 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్‌లను పొందుతారు. అలాగే రోజూ 1.5 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. అలాగే రోజువారీ 100SMS అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా రెండో ప్లాన్ రూ.119 ఇందులో 14 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో వినియోగదారులు రోజుకు 1.5 GB డేటాను పొందుతారు. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. అయితే మీరు 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ తీసుకోవాలనుకుంటే రూ.239 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Vi రీఛార్జ్ 200 లోపు Vodafone Idea 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌ను కూడా కలిగి ఉంది. దీనిలో వినియోగదారులు రోజువారీ 1 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 18 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ సమయంలో మీరు అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఏదైనా కొత్త రీఛార్జ్ ప్లాన్ రీఛార్జ్ చేయడానికి ముందు దాని గురించి ఇచ్చిన వివరణను జాగ్రత్తగా చదవాలి.
200లోపు ఎయిర్‌టెల్ రీఛార్జ్ ఎయిర్‌టెల్ రెండో ప్లాన్ రూ.155 దీనిలో వినియోగదారులు 24 రోజుల1 GB డేటా, వ్యాలిడిటీని పొందుతారు. దీంతో పాటు అపరిమిత కాలింగ్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంటుంది.