ముఖం ముడతలు పడుతుందని ఇబ్బందిపడుతున్నారా..! ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మెరిస్తే అందం మీ సొంతం..

Skin Care Tips: మొటిమలు, తామర, సొరియాసిస్ మొదలైన అనేక చర్మ సమస్యలకు కాలుష్యం కూడా కారణం కావచ్చు. దీనివల్ల చిన్నవయసులోనే చర్మంపై ముడతలు

ముఖం ముడతలు పడుతుందని ఇబ్బందిపడుతున్నారా..! ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మెరిస్తే అందం మీ సొంతం..
Skin Care
Follow us
uppula Raju

|

Updated on: Nov 30, 2021 | 9:35 PM

Skin Care Tips: మొటిమలు, తామర, సొరియాసిస్ మొదలైన అనేక చర్మ సమస్యలకు కాలుష్యం కూడా కారణం కావచ్చు. దీనివల్ల చిన్నవయసులోనే చర్మంపై ముడతలు ఏర్పడుతాయి. అంతేకాకుండా చలికాలంలో పొడి గాలి కారణంగా చర్మం నిస్తేజంగా మారుతుంది. ఈ పరిస్థితిలో మీరు మెరిసే చర్మం కోసం ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌ని ఉపయోగిస్తే మంచిది. అయితే మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్‌ కొంత సమయం వరకే పనిచేస్తాయి. అందుకే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మీరు ఇంట్లోనే ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకోవచ్చు. ఇవి మీరు కోల్పోయిన చర్మం కాంతిని తిరిగి తీసుకువస్తాయి.

1. వెన్న, ఆలివ్ నూనె ఆలివ్ ఆయిల్, వెన్న చర్మానికి సహజసిద్దమైన పోషణను అందిస్తాయి. ఈ రెండిటి ప్యాక్‌ చర్మంలోని అధిక మురికిని తొలగిస్తుంది. ఒక టీస్పూన్ కోకో బటర్, ఆలివ్ ఆయిల్, అర టీస్పూన్ అల్లంరసం కలిపి పేస్ట్‌లా చేయండి. దీన్ని మీ చర్మంపై, ముఖం, మెడపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చక్కటి ఫలితాలు ఉంటాయి.

2. అరటి, పాలు పాలు, అరటిపండు మిశ్రమం చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో అరటిపండు గుజ్జు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పాలు వేసి బాగా కలపాలి. దీన్ని మీ ముఖం, మెడపై అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి కొంత సమయం తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాలు ఉంటాయి.

3. అలోవెరా, ఆల్మండ్ ఆయిల్ 8-10 చుక్కల బాదం నూనె లేదా నువ్వుల నూనె, ఒక టీస్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి. దానిని పేస్ట్‌లా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేయండి. కనీసం 15 నిమిషాల పాటు మసాజ్‌ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ముఖం కడుక్కోండి. ఇది మీ చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.

4. బొప్పాయి, పచ్చిపాలు బొప్పాయిలో చర్మాన్ని మృదువుగా చేసే పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి పాలలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది పొడి, నిర్జీవ చర్మానికి తేమను అందిస్తుంది. ఇందుకోసం సగం పండిన బొప్పాయిని ముక్కలుగా చేసి పచ్చి పాలను తీసుకోవాలి. బొప్పాయిని మెత్తగా చేసి దానికి పచ్చి పాలు కలపండి. ఈ ప్యాక్‌ని మీ ముఖం, మెడకు అప్లై చేసి ఆరిపోయే వరకు ఉంచి నీటితో శుభ్రం చేసుకోండి. ముఖం మెరిసిపోతుంది.

పెంపుడు జంతువులు కరిస్తే అజాగ్రత్తగా ఉండకండి.. చాలా ప్రమాదం ఈ విషయాలు తెలుసుకోండి..

10 మ్యాచ్‌లో 43 వికెట్లు తీసిన ఈ బౌలర్‌ టీమిండియాకి సవాల్‌ విసిరాడు..! ఏ విషయంలో తెలుసా..?

దేశంలో పెరిగిపోతున్న ఊబకాయం కేసులు.. పిల్లల్లో, మహిళల్లో అధికం.. కారణాలు ఇలా..?

తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..