పెంపుడు జంతువులు కరిస్తే అజాగ్రత్తగా ఉండకండి.. చాలా ప్రమాదం ఈ విషయాలు తెలుసుకోండి..

Pets Bite: కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు వీధిలో తిరిగే జంతువుల కంటే చాలా సురక్షితమైనవి. ఎందుకంటే పెంపుడు జంతువులకు రేబిస్ టీకాలు వేస్తారు. అందువల్ల

పెంపుడు జంతువులు కరిస్తే అజాగ్రత్తగా ఉండకండి.. చాలా ప్రమాదం ఈ విషయాలు తెలుసుకోండి..
Dog
Follow us

|

Updated on: Nov 30, 2021 | 6:37 PM

Pets Bite: కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు వీధిలో తిరిగే జంతువుల కంటే చాలా సురక్షితమైనవి. ఎందుకంటే పెంపుడు జంతువులకు రేబిస్ టీకాలు వేస్తారు. అందువల్ల పొరపాటున అది కరిచినా ప్రమాదం ఏమి ఉండదు. కానీ వీధి జంతువులు కరిస్తే రేబిస్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే పెంపుడు జంతువులు కరిస్తే మీరు పూర్తిగా రిలాక్స్‌గా కూర్చుని ఇంట్లో గాయంపై క్రీమ్ రాసుకోవడం కాదు. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. టెటానస్ ఇంజక్షన్‌ వేసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా పెంపుడు జంతువు కరిస్తే ఈ కింది విషయాలను తెలుసుకోండి.

1. పెంపుడు జంతువు కరిస్తే వెంటనే ఇంట్లోనే ప్రథమ చికిత్స చేయాలి. ముందుగా డెటాల్‌తో గాయాన్ని బాగా కడిగి దానిపై యాంటీబయాటిక్ క్రీమ్ రాయాలి.

2. చిన్న స్క్రాచ్ ఉంటే ఇంట్లో యాంటీబయాటిక్ క్రీమ్ రాసుకుంటే పని చేస్తుంది. గాయం చాలా లోతుగా ఉంటే ప్రథమ చికిత్స సరిపోదు. ఇంట్లో ప్రథమ చికిత్స చేసిన తర్వాత వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

3. గాయం చిన్నదైనా, ప్రథమ చికిత్స ద్వారా నయమవుతున్నా ఒకసారి వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి. పెంపుడు జంతువుకు ఎప్పుడు టీకాలు వేయించారో కూడా వివరాలు ఉండాలి.

4. గాయం 3-4 రోజుల్లో నయం కాకపోతే అజాగ్రత్తగా ఉండకండి. వెంటనే వైద్యుడికి చూపించండి.

5. జంతువు కాటుకు గురైన వ్యక్తి ఐదు సంవత్సరాలుగా టెటానస్‌కు టీకాలు వేయించుకోపోతే చాలా ప్రమాదం. ఖచ్చితంగా టెటానస్ వ్యాక్సిన్ తీసుకోండి. ఏది ఏమైనా ప్రతి పదేళ్లకు ఒకసారి టెటానస్ వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి.

6. కరిచిన జంతువు కదలికలపై నిఘా ఉంచండి. జంతువు ఆరోగ్యం క్షీణించడం లేదా చనిపోవడం లేదా దాని ఆరోగ్యంలో ఏదైనా మార్పులు కనిపించినట్లయితే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.

2022 Apache RTR 200 4V విడుదల.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..

రకరకాల షాంపుల వల్ల జుట్టు ఊడిపోతుందా.. అయితే ఇంట్లోనే బెస్ట్‌ షాంపు తయారుచేసుకోండిలా..

వింత షరతు పెట్టిన రెస్టారెంట్‌.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ప్రవేశం లేదు.. ఎందుకో తెలుసా..?