Ravi Kiran |
Updated on: Nov 30, 2021 | 6:46 PM
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల మనకు దాహం ఎక్కువగా వేయదు. అందుకే అరుదుగా నీరు తాగుతుంటాం. అయితే ఈ కాలంలో దాహార్తి లేకపోయినా కూడా శరీరానికి అవసరమయ్యే స్థాయిలో నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు.
మీ శరీరంలో నీటికి కొరత ఏర్పడినప్పుడు.. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా జలుబు, సైనస్ వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.
శీతాకాలంలో ఎక్కువగా దాహం వేయదు. అలా అని చెప్పి నీరు తాగకుండా ఉండకండి. ఎప్పటికప్పుడు నీరు తాగుతూ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి. తద్వారా మీ శరీరానికి కావాల్సిన మొత్తంలో ఆక్సిజన్ అందుతుంది.
చలికాలంలో చాలామంది చలి తీవ్రత నుంచి బయటపడటానికి హీటర్ల దగ్గర కూర్చోవడం, స్వెటర్లు ధరించడం లాంటివి చేస్తారు. అలాగే పొడి గాలి కారణంగా చర్మ సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.
సాధారణంగా పొడి గాలులు చర్మపై ఉన్న కణాలను తేమగా మారుస్తాయి. ఇందువల్ల చర్మ సమస్యలు ఏర్పడుతాయి. వీటిని తగ్గించాలంటే అప్పుడప్పుడూ నీరు తాగడం చాలా మంచిది.