2022 Apache RTR 200 4V విడుదల.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..
2022 Apache RTR 200 4V: టీవీఎస్ మోటార్ కంపెనీ మంగళవారం కొత్త ద్విచక్ర వాహనాన్ని ప్రకటించింది. ఈ మోటార్‌సైకిల్ 2022 అపాచీ RTR 200 4V. దీని ఫీచర్లు ఎక్సలెంట్‌గా ఉన్నాయి.
2022 Apache RTR 200 4V: టీవీఎస్ మోటార్ కంపెనీ మంగళవారం కొత్త ద్విచక్ర వాహనాన్ని ప్రకటించింది. ఈ మోటార్‌సైకిల్ 2022 అపాచీ RTR 200 4V. దీని ఫీచర్లు ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు కల్పించారు.TVS SmartX కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ, సర్దుబాటు చేయగల బ్రేక్, క్లచ్ లివర్లు ఇచ్చారు. దీంతో పాటు 197.75 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు.
2022 Apache RTR 200 4V ధర.. 2022 Apache RTR 200 4V రెండు వేరియంట్లలో వస్తుంది. ప్రారంభ వేరియంట్ ధర రూ. 1,33,840 (ఎక్స్-షోరూమ్), ఇది సింగిల్ ఛానల్ ABS పొందుతుంది. రెండో వేరియంట్ ధర రూ. 1.38 లక్షలు డ్యూయల్ ఛానెల్ ABS కలిగి ఉంది.
2022 అపాచీ RTR 200 4V స్పెక్స్ TVS నుంచి ఈ సరికొత్త 2022 Apache RTR 200 4V మోడల్‌లో స్పోర్ట్స్, అర్బన్, రెయిన్ మోడ్‌లు మూడు రైడింగ్ మోడ్‌లు అందించారు. ఇది కాకుండా ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో ప్రీ-లోడెడ్ అడ్జస్టబుల్ షోవా ఫ్రంట్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇది వెనుక మోనో షాక్, సర్దుబాటు చేయగల బ్రేక్, క్లచ్ లివర్లను అమర్చారు. వినియోగదారుల ప్రస్తుత అవసరాన్ని అర్థం చేసుకున్న ఈ బైక్ TVS స్మార్ట్ కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీతో పనిచేస్తుంది.
2022 అపాచీ RTR 200 4V ఇంజిన్ 2022 Apache RTR 200 4V 197.75 cc సింగిల్ సిలిండర్. నాలుగు వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ ఐదు గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ 8500 rpm వద్ద 20.2 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 7,500 rpm 16.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ మూడు కొత్త కలర్ వేరియంట్‌లలో వస్తుంది. అవి గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్, మ్యాట్ బ్లూ. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రైడింగ్ సాఫీగా సాగేందుకు కంపెనీ ఫస్ట్ క్లాస్ ఫీచర్లతో మూడు మోడ్ లను అందించింది.