Rachin Ravindra: భారత విజయాన్ని అడ్డుకున్నవారు భారతీయులే..! కివీస్‌ని ఓటమి నుంచి రక్షించారు..

Rachin Ravindra: కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసన సంగతి అందరికి తెలిసిందే. మ్యాచ్ ఐదో రోజు చివరి గంటలో భారత్ విజయానికి ఒక వికెట్ అవసరం.

Rachin Ravindra: భారత విజయాన్ని అడ్డుకున్నవారు భారతీయులే..! కివీస్‌ని ఓటమి నుంచి రక్షించారు..
Rachin Ajaj
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2021 | 5:04 PM

Rachin Ravindra: కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసన సంగతి అందరికి తెలిసిందే. మ్యాచ్ ఐదో రోజు చివరి గంటలో భారత్ విజయానికి ఒక వికెట్ అవసరం. భారత బౌలర్లు ఆ పని చేయలేకపోయారు. అజాజ్ పటేల్, రాచిన్ రవీంద్ర భాగస్వామ్యాన్ని టీమిండియా బ్రేక్ చేయలేకపోయింది. 284 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయినా చివరి వికెట్ పడకుండా ఈ ఇద్దరూ ఆట ముగిసే వరకు బ్యాటింగ్ చేశారు.

అయితే ఇ ఇద్దరు ప్లేయర్లు ఇప్పుడు భారతీయులే అని తేలింది. న్యూజిలాండ్‌కు చెందిన భారత సంతతి ఆటగాళ్లు. రవీంద్ర, ఎజాజ్ పటేల్ కలిసి 91 బంతులు ఆడి 18 పరుగులు చేశారు. వీరిద్దరి భాగస్వామ్యం కారణంగా న్యూజిలాండ్ మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన రాచిన్‌ రవీంద్ర వెల్లింగ్టన్‌లో పుట్టినా అతని తండ్రి రవి కృష్ణమూర్తి భారత్‌కు చెందినవాడు.

స్వస్థలం బెంగళూరు కాగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన కృష్ణమూర్తి వేర్వేరు దేశాల్లో ఉద్యోగం చేస్తూ చివరకు న్యూజిలాండ్‌లో స్థిరపడ్డాడు. క్లబ్‌ స్థాయి క్రికెట్‌లో తనతో కలిసి ఆడిన జవగల్‌ శ్రీనాథ్‌తో అతనికి మంచి స్నేహం ఉంది. రాహుల్‌ ద్రవిడ్, సచిన్‌ టెండూల్కర్‌ పేర్ల కలయికతో తన కొడుకుకు ‘రచిన్‌’ పేరు పెట్టాడు. 33 ఏళ్ల ఎజాజ్‌ పటేల్‌ ముంబైలోనే పుట్టాడు.1996లో అతని కుటుంబం న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది.

AP Weather Report: రాగల 2 రోజుల్లో ఏపీలో పొడి వాతావరణం.. ఎల్లుండి తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు..

IND VS NZ: ఊహించని రీతిలో వికెట్‌ చేజార్చుకున్న కివీస్‌ బ్యాట్స్‌మెన్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

LIC: పేద ప్రజల కోసం ఎల్‌ఐసీ బెస్ట్‌ పాలసీ.. తక్కువ ప్రీమియం.. ఎక్కువ ఆదాయం..

Hair Loss: శరీరంలో ఇవి లోపిస్తే బట్టతల వచ్చేస్తుంది..! ఏంటో తెలుసుకోండి..?