AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS NZ: ఊహించని రీతిలో వికెట్‌ చేజార్చుకున్న కివీస్‌ బ్యాట్స్‌మెన్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

IND VS NZ: కాన్పూర్ టెస్టు ఐదో రోజు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ అద్భుతమైన డిఫెన్స్‌ని ప్రదర్శించారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా చెత్త షాట్‌ ఆడి ఔట్‌ కాలేదు.

IND VS NZ: ఊహించని రీతిలో వికెట్‌ చేజార్చుకున్న కివీస్‌ బ్యాట్స్‌మెన్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..
Ashwin
uppula Raju
|

Updated on: Nov 29, 2021 | 10:07 PM

Share

IND VS NZ: కాన్పూర్ టెస్టు ఐదో రోజు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ అద్భుతమైన డిఫెన్స్‌ని ప్రదర్శించారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా చెత్త షాట్‌ ఆడి ఔట్‌ కాలేదు. టేలర్, విలియమ్సన్, టామ్ లాథమ్ వంటి బ్యాట్స్‌మెన్లు బాల్ డౌన్ కావడం వల్ల ఔటయ్యారు. అయితే న్యూజిలాండ్‌కు చెందిన ఒక బ్యాట్స్‌మెన్ అత్యుత్తమ డిఫెన్స్ షాట్ ఆడినప్పటికీ అవుట్ అయ్యాడు. అతడు ఎవరో కాదు కివీస్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్. ఇప్పుడు ఇతడి ఔట్‌కి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

79వ ఓవర్లో టామ్ బ్లండెల్ చాలా దురదృష్టకర రీతిలో బౌల్డ్ అయ్యాడు. అశ్విన్ బంతికి ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చేసాడు. కానీ బంతి అతని బ్యాట్‌ను తాకిన తర్వాత క్రీజులో ఉన్న వికెట్ల వైపు వెళ్లి స్టంప్స్‌ని తగిలింది. ఊహించని షాక్‌కి టామ్ బ్లండెల్ కొద్ది సేపు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో ఏం చేయాలో అతడికి తెలియలేదు. బ్లండెల్ ఇలా ఔటవడం చూసి కామెంట్రీ చేస్తున్న మాజీ క్రికెటర్ కూడా ఆశ్చర్యపోయాడు. అతడు 38 బంతులు ఆడాడు కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు.

బ్లండెల్ కంటే ముందు న్యూజిలాండ్ ఓపెనర్‌ విల్ యంగ్ కూడా దురదృష్టవంతుడని చెప్పవచ్చు. ఎందుకంటే నాలుగో రోజు ఆటలో అశ్విన్ వేసిన బంతికి అతను ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అయితే విల్ యంగ్ రివ్యూను 1 సెకను వ్యవధిలో కోల్పోయాడు. రీప్లేలు చూస్తే విల్ యంగ్ నాటౌట్ అని స్పష్టమైంది. ఒకవేళ అతను సమయానికి రివ్యూ తీసుకుని ఉంటే న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి ఉండేది కాదు. అయితే న్యూజిలాండ్‌ ఆటగాళ్లు చివరి వరకు పోరాడి ఓటమి నుంచి తప్పించుకున్నారు. మ్యాచ్‌ డ్రా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Realme 9 సిరీస్ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్లు.. జనవరిలో ప్రారంభించే అవకాశం..

Pensioners: పెన్షన్ పొందడం ఇప్పుడు చాలా సులభం..! ఏ పత్రాలు అవసరం లేదు..

Hyderabad‌: నూతన ఓటరు నమోదుకు ఈ నెల 30 చివరితేది.. మార్పులు చేర్పులకు కూడా అవకాశం..