AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad‌: నూతన ఓటరు నమోదుకు ఈ నెల 30 చివరితేది.. మార్పులు చేర్పులకు కూడా అవకాశం..

Hyderabad‌: నూతన ఓటరు నమోదుకు నవంబర్‌ 30 చివరి తేది. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని హైదరాబాద్

Hyderabad‌: నూతన ఓటరు నమోదుకు ఈ నెల 30 చివరితేది.. మార్పులు చేర్పులకు కూడా అవకాశం..
Representative Image
uppula Raju
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 29, 2021 | 8:09 PM

Share

Hyderabad‌: నూతన ఓటరు నమోదుకు నవంబర్‌ 30 చివరి తేది. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. నమంబర్ 1, 2021న విడుదల చేసిన ఓటరు జాబితాలో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని కోరారు. ఈ జాబితాలో పేరు మార్పు, అడ్రస్ మార్పు, తదితర మార్పులు, చేర్పులు ఈ ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా చేసుకోవచ్చని తెలిపారు.

ఇందుకోసం మీ సమీప పోలింగ్ బూత్ లో ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారి అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవలన్నారు. ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు ఫారం-7, తప్పుల సవరణకు ఫారం-8, ఒకే నియోజక వర్గంలో మార్పుకు ఫారం-8A ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఓటు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి, గతులను మార్చే శక్తి ఓటుకు ఉన్నది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలి, మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండడమే కాదు ఓటూ ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జి హెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు ఒక అస్త్రంలాంటిది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు కూడా అంతే అవసరం.

Winter: శీతాకాలంలో ఈ పని తప్పకుండా చేయాలి.. లేదంటే అది మీకు లభించదు..

Winter: శీతాకాలంలో క్రమం తప్పకుండా ఈ ఆహారాలను తినాలి..! ఎందుకంటే..?

Paytm: పేటీఎం నయా సేవలు.. ఒక్క కార్డు అన్ని పనులు.. వన్‌ నేషన్‌ వన్‌ కార్డ్‌