Winter: శీతాకాలంలో ఈ పని తప్పకుండా చేయాలి.. లేదంటే అది మీకు లభించదు..

Winter: శీతాకాలం వచ్చిందంటే అందరు వెచ్చదనాన్ని కోరుకుంటారు. ఉదయం పూట బయటికి రావడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటివారు ఈ విషయాన్ని తెలుసుకుంటే

Winter: శీతాకాలంలో ఈ పని తప్పకుండా చేయాలి.. లేదంటే అది మీకు లభించదు..
Sun Exposure
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2021 | 7:16 PM

Winter: శీతాకాలం వచ్చిందంటే అందరు వెచ్చదనాన్ని కోరుకుంటారు. ఉదయం పూట బయటికి రావడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటివారు ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరికి సూర్యరశ్మి అవసరం లేదంటే మీ శరీరానికి విటమిన్‌ డి లభించదు. ఇది లేకుంటే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో సూర్యుడు కాస్త ఆలస్యంగా తన కిరణాలను ప్రసరింపజేస్తాడు. ఆ నులివెచ్చని కిరణాలను ప్రతి ఒక్కరు ఆస్వాదించాలి. అప్పుడు నిత్యం ఆరోగ్యంగా ఉంటారు.

సూర్యోదయం తర్వాత 25 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో వాకింగ్‌ చేస్తే చాలా మంచిది. పిల్లలు, వృద్ధులు తప్పకుండా ఈ పనిచేయాలి. అప్పుడు విటమిన్‌ డి మీ శరీరానికి అందుతుంది. ఈ విటమిన్‌ మీ రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. సూర్యకాంతిలో ఉన్న UVA రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను, శ్వాసక్రియ రేటును తగ్గిస్తుంది. సూర్యకాంతిలో ఉండే సెరోటోనిన్, మెలటోనిన్, డోపమైన్ మీ మానసిక ఆరోగ్యానికి, ఆందోళన, డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

విటమిన్ డి ఆహారం ద్వారా తీసుకోవడం సాధ్యం కాదు. కేవలం ఇది సూర్యరశ్మి ద్వారానే సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి పది గ్లాసులు పాలు తీసుకుంటే కనీస మొత్తంలో విటమిన్ డి శరీరంలో చేరుతుంది. సూర్యకిరణాలు బలహీనంగా ఉంటే విటమిన్ డి తయారు చేసే సామర్థ్యాన్ని శరీరం 95 శాతం కోల్పోతుంది. అయితే శరీరం ఎంత మేర అవసరమో అంతే మొత్తంలో సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి ని గ్రహిస్తుంది. శరీరంలో అత్యంత శక్తివంతమైన రసాయనాలల్లో విటమిన్ డి కూడా ఒకటి. ఇది లేకుండా వ్యాధులను ఎదుర్కోవడం చాలా కష్టం.

పరగడుపున నిమ్మకాయ రసం తాగితే నిజంగానే బరువు తగ్గుతారా..? వాస్తవాలు ఏంటో తెలుసుకోండి..

IND vs NZ, 1st Test, Day 5 Highlights: డ్రాగా ముగిసిన కాన్పూర్‌ టెస్ట్.. చివరి వికెట్‌ సాధించలేకపోయిన భారత్‌

IND vs NZ: డ్రాగా ముగిసిన తొలి టెస్ట్‌.. భారత్‌ పోరాటం వృథా..