Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leptin and Obesity: మీలో ఈ హార్మోన్లు పనిచేయకపోతే డయాబెటిస్ వచ్చినట్లే.. అవేం చేస్తాయో తెలుసా..

పొట్టలోని కొవ్వును వదిలించుకోవటంలో మీకు సాయపడే ఆహారం, ఇతర చిట్కాల గురించి మనం చాలాసార్లు తెలుకున్నాం. అయితే అది ఎలా వస్తాయి..? వీటి వెనుక ఏముంటాయి..? అయితే..

Leptin and Obesity: మీలో ఈ హార్మోన్లు పనిచేయకపోతే డయాబెటిస్ వచ్చినట్లే.. అవేం చేస్తాయో తెలుసా..
Gaining Weight
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2021 | 7:16 PM

పొట్టలోని కొవ్వును వదిలించుకోవటంలో మీకు సాయపడే ఆహారం, ఇతర చిట్కాల గురించి మనం చాలాసార్లు తెలుకున్నాం. అయితే అది ఎలా వస్తాయి..? వీటి వెనుక ఏముంటాయి..? అయితే పొట్టలో కొవ్వు చేరడానికి సాధారణంగా రెండు విషయాలు కారణమవుతాయి. అందుకని బానపొట్ట తగ్గించుకోవాలంటే సరైన ఆహారం, వ్యాయామం రెండూ అవసరం. కానీ కొన్నిసార్లు ఈ బానపొట్టకి కారణాలు సంబంధం లేని విషయాలు అంటే మానసిక ఒత్తిడి.. సరిపడినంత నిద్ర లేకపోవటం ఇలాంటివి అయివుంటాయి. మానవ శరీరంలో 600 హార్మోన్లు ఉంటాయి. ఇవి వివిధ శారీరక, మానసిక కార్యకలాపాలను మన శరీరానికి  నిర్వహిస్తాయి. ఈ 600 హార్మోన్లలో ఆరు అటువంటి హార్మోన్లు వీటిని వైద్య భాషలో కొవ్వు నిల్వ హార్మోన్లు అంటారు. ఇవి హార్మోన్లు ఇవి శరీర బరువును పెంచడానికి ప్రధాన పాత్రను పోషిస్తుంటాయి.

మన చుట్టూ ఉన్న చాలా మంది వ్యక్తులను మనం చూస్తాం. వారి ఆహారం చాలా యాదృచ్ఛికంగా ఉండదు. కానీ ఇప్పటికీ వారి బరువు, శరీర నిష్పత్తిలో గందరగోళం ఉంటుంది. వారు ప్రధానంగా బరువు పెరగడం హార్మోన్ల అసమతుల్యత అంటే అదనపు కొవ్వు నిల్వ హార్మోన్లు , తక్కువ కొవ్వును కరిగించే హార్మోన్ల వల్ల ఇలా జరుగుతుంది.

శరీరంలో ఆరు రకాల కొవ్వు నిల్వ హార్మోన్లు..  3 కొవ్వును కరిగించే హార్మోన్లు ఉంటాయి. ఈ హార్మోన్లు శరీరంలో శక్తిని నియంత్రించడానికి పని చేస్తాయి. కొవ్వు నిల్వ ప్రక్రియను నిరోధిస్తాయి. బరువు తగ్గించడంలో చాలా ప్రధానంగా పని చేస్తుంటాయి.

మనం బరువు తగ్గుతామా..? లేదా..? అనేది ప్రధానంగా ఈ రెండు ప్రధాన హార్మోన్ల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అవి శరీరంలో ఎలా పనిచేస్తాయనేదే ఇక్కడ అసలు సమస్య. ఇన్సులిన్ ప్రధానమైన కొవ్వు నిల్వ హార్మోన్ మొత్తం కొవ్వును కరిగించే హార్మోన్ కంటే ఎక్కువగా ఉంటే.. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం అనే జరగదు.

లెప్టిన్ హార్మోన్ ఏం చేస్తుంది..

లెప్టిన్ మన శరీరంలో కనిపించే ప్రధాన కొవ్వును కాల్చే హార్మోన్, ఇది బరువును నియంత్రించడంలో పని చేస్తుంది. ఈ హార్మోన్ యొక్క పని ఆకలి కేంద్రాన్ని నియంత్రించడం తిన్న ఆహారం కొవ్వు నిల్వగా మారకుండా నిరోధించడం. లెప్టిన్ హార్మోన్ శరీరంలో తగినంతగా ఉంటే, మనం తినే ఆహారం మరింత చురుకైన వేగంతో శక్తిగా మార్చబడుతుంది. ఊబకాయం పెరగకుండా చేస్తుంది.

లెప్టిన్ హార్మోన్ క్రియాశీలత కూడా మన ఇన్సులిన్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఇన్సులిన్ ఎక్కువగా ఉంటే.. లెప్టిన్ సరిగ్గా పని చేయదు. అయితే మనం తిన్నటువంటి చాలా ఆహారం కొవ్వుగా మారుతుంది. శక్తిగా మార్చబడకుండా శరీరంలో నిల్వ చేయబడుతుంది.

మన శరీరంలోని లెప్టిన్ హార్మోన్‌లో సరిగ్గా పని చేయనప్పుడు.. శరీరం బరువు పెరగడం ప్రారంభమవుతుంది. ఈ హార్మోన్ల అసమతుల్యత ఇన్సులిన్ రెసిస్టెంట్ స్థితిని కూడా ఏర్పడుతుంది. ఇది మధుమేహం రావడానికి కారణంగా మారుతుంది.

ఊబకాయం ప్రతి వ్యాధికి మూలం అని మీరు తరచుగా ఇలాంటి విషయాలు వినే ఉంటారు. మీరు ఊబకాయంతో ఉన్నట్లయితే.. మీకు మధుమేహం, రక్తపోటు(బీపీ) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం లెప్టిన్ హార్మోన్ మన శరీరంలో పనిచేయడం మానేస్తుంది.

ఇవి కూడా చదవండి: CM Jagan: ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు.. చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం..

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. తెరపైకి కొత్తగా గంగాధర్‌ రెడ్డి కామెంట్స్..