CM Jagan: ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు.. చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం..
చంద్రబాబువి బురద రాజకీయాలని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గతంలో బాధితులను ఆదుకోవడానికి కనీసం నెల పట్టలేదని.. ఇప్పుడు వారంలోనే సాయం చేశామన్నారు.
CM Jagan – ChandraBabu: చంద్రబాబువి బురద రాజకీయాలని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గతంలో బాధితులను ఆదుకోవడానికి కనీసం నెల పట్టలేదని.. ఇప్పుడు వారంలోనే సాయం చేశామన్నారు. హుధుద్‌లో రూ.22 వేల కోట్ల నష్టం జరిగిందని చెబితే.. ఇచ్చింది రూ.550 కోట్లేనని గుర్తు చేశారు. అదంతా కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చిందన్నారు. 22 వేల కోట్లు నష్టం వచ్చిందని చెప్పిన ఆ పెద్ద మనిషి.. ఇచ్చింది రూ.550 కోట్లని తప్పుబట్టారు. కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని ఇంతవేగంగా అందిస్తే.. దానిపైనా బురద జల్లుతున్నారని చంద్రబాబు తీరును తప్పుబట్టారు సీఎం జగన్.
అయితే బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించామన్నారు. గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేదన్నారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేదని.. గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదని విమర్శించారు.
అలాంటిది ఇవాళ వారంరోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకుంటున్నామని సీఎం జగన్ వివరించారు. గతంలో రేషన్, నిత్యావసరాలు ఇస్తే చాలు అనుకునేవాళ్లు.. ఇప్పుడు మనం వీటిని ఇవ్వడమే కాకుండా రూ.2వేల రూపాయలు అదనపు సహాయం కూడా ఇచ్చామని.. గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదన్నారు.
చంద్రబాబు ఉన్న సమయంలో సీజన్ ముగిసేలోగా నష్టపోయిన రైతులకు సహాయం చేసిన దాఖలాలు లేవని.. ఇప్పుడు నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తిచేసినట్లుగా చెప్పారు. సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నామని వెల్లడించారు.
గతంలో ఇన్‌పుట్‌సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేదని.. ఆతర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇవాళ పంట నష్టపోయిన సీజన్ ముగిసేలోగానే మనం అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ.6వేల కోట్లు నష్టం జరిగితే.. ఇచ్చింది రూ.34 కోట్లే అని విమర్శలు చేస్తున్నారని చంద్రబాబును పరోక్షంగా విమర్శించారు.
జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు రూపేణా.. 30శాతానికిపైగా పంటరూపేణా, సుమారు 18శాతం ప్రాజెక్టులకు జరిగిన నష్టం రూపేణా జరిగిందన్నారు.
ఇవి కూడా చదవండి: Omicron Variant: ఆందోళనకు గురి చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. అసలు ఇది ప్రాణాంతకమా? కాదా?..
Telangana: శివాలయంలో అద్భుతం… చేద బావి నుంచి సలసలా మరిగే వేడి నీళ్లు