Farm Laws Repeal bill: విపక్షాల ఆందోళన నడుమ వ్యవసాయ సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుకు (Farm Laws Repeal Bill) లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Farm Laws Repeal bill: విపక్షాల ఆందోళన నడుమ వ్యవసాయ సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Farm Laws Repeal Bill
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 29, 2021 | 12:41 PM

Farm Laws Repeal bill Passed: వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుకు (Farm Laws Repeal Bill) లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.విపక్షాల ఆందోళన మధ్యనే సాగు చట్టాల రద్దు బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం మూజువాణి ఓటు బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్టుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. తర్వాత విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.

పార్లమెంటు సమావేశాలు మొదలైన తొలిరోజే కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌స‌భ‌లో కేంద్ర వ్యవ‌సాయ‌శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశ‌పెట్టారు. అయితే ఆ స‌మ‌యంలో విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. బిల్లుపై చర్చ నిర్వహించాలని విప‌క్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌స‌భ‌ ర‌సభ‌సగా మారింది. ఈ బిల్లుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ డిమాండ్ చేశారు. ఇక, తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లిన నిర‌స‌న చేప‌ట్టారు. ప్లకార్డులు ప్రద‌ర్శిస్తూ.. ధాన్యం కొనుగోలుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.

కాగా, సాగు చట్టాలపై చ‌ర్చ లేకుండా మూడు వ్యవ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు చేయ‌డంతో విప‌క్షాలు గంద‌ర‌గోళం సృష్టించాయి. మూజువాణి ఓటుతోనే బిల్లుకు ఓకే చెప్పేశారు. దీంతో విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకువ‌చ్చారు. అయితే చ‌ర్చను చేప‌ట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పిన స్పీక‌ర్ బిర్లా.. ఆ గంద‌ర‌గోళం మ‌ధ్య స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వాయిదా వేశారు.

Read Also… Parliament: ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చకు సిద్ధం.. దేశ ప్రయోజనాల కోసం శాంతియుతంగా చర్చించుకుందాంః ప్రధాని మోడీ