AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament: ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చకు సిద్ధం.. దేశ ప్రయోజనాల కోసం శాంతియుతంగా చర్చించుకుందాంః ప్రధాని మోడీ

పార్లమెంటులో అన్ని ప్రశ్నలను ఎదుర్కొని, సమాధానం చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.

Parliament: ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చకు సిద్ధం.. దేశ ప్రయోజనాల కోసం శాంతియుతంగా చర్చించుకుందాంః ప్రధాని మోడీ
Pm Narendra Modi
Balaraju Goud
|

Updated on: Nov 29, 2021 | 12:19 PM

Share

Parliament winter session: పార్లమెంటులో అన్ని ప్రశ్నలను ఎదుర్కొని, సమాధానం చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. అయితే సభ గౌరవాన్ని, సభాపతి సమగ్రతను, హుందాతనాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ మీడియతో మాట్లాడారు. ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని తెలిపారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాలు, శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి సామాన్య పౌరుడు ఈ పార్లమెంటు సమావేశాలు గమనిస్తారని, వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు దేశ ప్రయోజనాల కోసం చర్చలు జరపాలని, దేశాభివృద్ధి కొరకు కొత్త మార్గాలను కనుగొనాలని ప్రధాని అన్నారు.

ఈ పార్లమెంటు సభా కార్యకలాపాలు సజావుగా జరగాలని కోరుకుంటున్నట్లు మోడీ తెలిపారు. ఈ సమావేశాల్లో సకారాత్మక కృషి జరగడం ముఖ్యమని చెప్పారు. పార్లమెంటులో చర్చించాలని, సభ గౌరవ, మర్యాదలను కాపాడాలని చెప్పారు. వాయిదాలు, అంతరాయాలు కాకుండా అర్థవంతమైన చర్చ జరిగిందని ఈ సమావేశాలు గుర్తుండిపోవాలని కోరుకుంటున్నట్లు ప్రధాని ఆకాక్షించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పినంత మాత్రాన పార్లమెంటు గౌరవానికి, స్పీకర్ గౌరవానికి సంబంధించి, రాబోయే రోజుల్లో దేశంలోని యువ తరానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలని మోదీ అన్నారు. బలవంతంగా పార్లమెంట్‌ కార్యకలాపాలను ఆపడం ప్రమాణం కాదన్నారు.“పార్లమెంటు ఎన్ని గంటలు కొనసాగింది అనేది ప్రమాణం. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్తులో పార్లమెంట్‌ను ఎలా నడపాలి, మీరు ఎంత బాగా సహకరించారు, ఎంత సానుకూలంగా పని చేశారు.. ఆ స్థాయిలోనే బేరీజు వేసుకోవాలన్నారు. పార్లమెంటు హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎంపీపైన ఉందన్నారు.

గత సెషన్ తర్వాత, కరోనా విపత్కర పరిస్థితిలో కూడా, దేశం 100 కోట్ల కంటే ఎక్కువ మోతాదుల కరోనా వ్యాక్సిన్‌ల సంఖ్యను దాటిందని, భారత్ 150 కోట్ల డోస్‌ల దిశగా పయనిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త వేరియంట్‌ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి, అందుకే పార్లమెంట్‌లోని సహచరులందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఈ సంక్షోభ సమయంలో మీ మంచి ఆరోగ్యమే మా ప్రాధాన్యత అన్నారు.“ఈ కరోనా సంక్షోభం సమయంలో దేశంలోని 80 కోట్ల మంది పౌరులు బాధపడకూడదని, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత ఆహార ధాన్యాల పథకం కొనసాగిస్తున్నామని మోడీ తెలిపారు. ఇప్పుడు ఈ పథకం మార్చి 2022 వరకు పొడిగించామన్నారు. దాదాపు రూ.2.60 లక్షల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ సెషన్‌లో మనం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నానని మోడీ తెలిపారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్నాయి. వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసే బిల్లును సమావేశాల తొలిరోజునే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండూ పార్టీలు సభ్యులు ఖచ్చితంగా సమావేశాలకు హాజరు కావాలని విప్ జారీ చేశాయి. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నంలో భాగంగా సంఘీభావం తెలిపేందుకు, సమావేశాలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్ పలు విపక్షాలతో సమావేశాలు కూడా నిర్వహించింది.

Read Also… Parliament Winter Session: శీతకాల సమావేశాలు అరంభంతో విపక్షాల ఆందోళన.. హుందాతనాన్ని నిలబెట్టాలన్న ప్రధాని