Omicron Variant: ఆందోళనకు గురి చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. అసలు ఇది ప్రాణాంతకమా? కాదా?..

కరోనా వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు డెల్టా వేరియంట్ అన్నారు. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ అంటున్నారు. మరి ఇంది ప్రాణాంతకమా? కాదా?.. అంటే కాదు అంటున్నారు సౌత్ ఆఫ్రికన్ డాక్టర్....

Omicron Variant: ఆందోళనకు గురి చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. అసలు ఇది ప్రాణాంతకమా? కాదా?..
Omicron
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 29, 2021 | 12:57 PM

కరోనా వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు డెల్టా వేరియంట్ అన్నారు. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ అంటున్నారు. మరి ఇంది ప్రాణాంతకమా? కాదా?.. అంటే కాదు అంటున్నారు సౌత్ ఆఫ్రికన్ డాక్టర్. ఒమిక్రాన్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన సౌత్ ఆఫ్రికన్ డాక్టర్ ఏంజెలిక్ కొయెట్జి తన దగ్గరకి ట్రీట్మెంట్‎కి వచ్చిన పేషెంట్స్ త్వరగా కోలుకున్నారు అని చెప్పారు. గత 10 రోజులుగా దాదాపు 30 పేషెంట్స్‎ను చూడగా వారిలో తీవ్రమైన కోవిడ్ లక్షణాలు ఏమి కనిపించలేదన్నారు. వీరెవరూ హాస్పిటల్‎లో చేరకుండానే డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు

అందరు యువకులు అయినా బాగా అలసట కనిపించిందని ఏంజెలిక్ కొయెట్జి చెప్పారు. దానితో పాటు కొంచెం గొంతులో గరగర, పొడి దగ్గు, కండరాల నొప్పులతో తన దగ్గరకు వచ్చారని వివరించారు. ఎక్కువ మంది పేషెంట్లలో స్మెల్ రుచి పోలేదని అన్నారు. కొద్దిమందిలోనే హై టెంపరేచర్ కనిపించిందని పేర్కొన్నారు. తీవ్రమైన లక్షణాలు చూపించే ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ అని ఏంజెలిక్ కొయెట్జి వెల్లడించారు.

వాక్సిన్ అవ్వనివారు కూడా సేఫ్!

ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారు ఎక్కువ మంది 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నారు. అందులో ఎక్కువగా మగవారు ఉండగా.. సగానికన్నా తక్కువ మందికి మాత్రమే వ్యాక్సినేషన్ అయిందని చెప్పారు. ఇంతవరకు చాలా మంది వాక్సిన్ లేనివారు కూడా డిశ్చార్జ్ అయ్యారని చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా వస్తున్న కేసుల్లో మూడు వంతులు ఇదే వేరియంట్ వి! అని తెలిపారు. ఎక్కువమందికి పూర్తిగా వాక్సిన్ అందకపోయినా మరి ఇంతవరకు హాస్పిటల్స్ ఎందుకు నిండిపోవట్లేదు అని ప్రశ్నించారు.

అతిగా ఆందోళన

మొదటి ఏడుగురు పేషెంట్లనీ చూసాక ‘డెల్టా కంటే భిన్నంగా’ ఉందని ఆరోగ్య అధికారులను అలెర్ట్ చేసినట్లు ఏంజెలిక్ కొయెట్జి తెలిపారు. అప్పటికే దానిని గుర్తించిన సైంటిస్టులు దానికి B.1.1.529 అనే పేరు కూడా పెట్టి నవంబర్ 25 న అనౌన్స్ చేసినట్లు చెప్పారు. దీనితో సౌత్ ఆఫ్రికా మీద ట్రావెల్ బ్యాన్ వేయటం నుండి దాన్ని భయంకరమైన వేరియంట్‎గా చిత్రీకరించటం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అది ఎంత డేంజరస్ అనేది తెలియక మునుపే దాన్ని అతి తీవ్రం అని నిర్ధారించారని అన్నారు. అసలు వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అనేది తేలాల్సి ఉందన్నారు. ఈపాటికే యూరోప్‎లో ఎంతోమంది దీని బారిన పడి ఉండచ్చన్నారు.

టూ ఎర్లీ టు సే అంటున్న సైంటిస్ట్స్

తీవ్రమైన రోగంగా మారదు అనటానికి ఇది సరైన సమయం కాదని కొందరు సైంటిస్టులు అంటున్నారు. ఇప్పటిదాకా ఈ వేరియంట్ ఎక్కువశాతం యువకుల్లోనే కనిపించటం వలన ఎక్కువ ప్రభావం ఉండకపోవచ్చు అని చెబుతున్నారు. సౌత్ ఆఫ్రికాలో కాలేజీలు, యూనివర్సిటీలు, వీటిల్లోనే అధిక శాతం కేసులు వచ్చాయని పేర్కొంటున్నారు. మిగతా జనాభాలోకి వైరస్ వెళ్తే సీన్ మారచ్చని అంటున్నారు. కేసులు రెండు వారాల నుండే పెరుగుతోందని.. మరికొన్ని రోజుల్లో తీవ్రంగా మారే అవకాశముందని తెలిపారు.

Read Also.. Covid 19 Omicron Variant: PCR పరీక్ష ద్వారా కరోనా ఓమిక్రాన్ వేరియంట్‌ని గుర్తించవచ్చా? WHO ఏం చెప్పిందంటే..?