Cashew Benefits: ఆరోగ్యానికి మేలు చేసే జీడిపప్పును చలికాలంలో అసలు తినకూడదంట.. ఎందుకో తెలుసుకోండి..
జీడిపప్పు చాలా ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్. దీనిని పచ్చిగా.. కాల్చిన.. వేయించిన పాలలో ఉడకబెట్టి తీసుకుంటే అనేక ప్రయోజనాలుంటాయి
జీడిపప్పు చాలా ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్. దీనిని పచ్చిగా.. కాల్చిన.. వేయించిన పాలలో ఉడకబెట్టి తీసుకుంటే అనేక ప్రయోజనాలుంటాయి. అలాగే స్వీట్లలో కూడా ఈ జీడిపప్పును ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్, ఐరన్, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు జీడిపప్పులో లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇక చలికాలంలో కొందరు రోజూ ఉదయాన్నే జీడిపప్పును తీసుకుంటారు. రోజూ కొద్ది పరిమాణంలో జీడిపప్పును తీసుకుంటారు. ఇన్ని ప్రయోజనాలు అందించే జీడిపప్పు కొన్నిసార్లు ఆరోగ్యానికి హానీ కలిగిస్తుందని తెలుసా.. అది ఎలాగో తెలుసుకుందామా.
శరీరానికి కావలసిన అన్ని పోషకాలను జీడిపప్పు నుండి పొందవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒలిక్ ఆసిడ్ పుష్కలంగా ఉంటుంది. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటాన్ని 25శాతం వరకు తగ్గించుకోవచ్చు. రక్తహీనత లేకుండా చేస్తుంది.
జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు జీడిపప్పు తినవద్దు. అలాగే విరేచనాలు, గ్యాస్, అజీర్ణం సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారు జీడిపప్పును అసలు తినకూడదు. ఇందులో కెలరీల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక కొందరికి జీడిపప్పు తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దీంతో వాంతులు, దురద, విరేచనాలు, దద్దర్లు వంటి సమస్యలు వస్తాయి. జీడిపప్పు తినడం ద్వారా తలనొప్పి సమస్య కావచ్చు. ఇందులో టైరమైన్, ఫైనిలేథైలమైన్ అనే అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి తలనొప్పిని కలిగిస్తాయి. జీడిపప్పు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.