AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: కేంద్రం అసంబద్ధ విధానంపై పోరాడుదాం.. జాతీయ ఆహార సమగ్ర విధానాన్ని ప్రకటిచాలిః సీఎం కేసీఆర్

పార్లమెంటులో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ విధానం పై పోరాడాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

CM KCR: కేంద్రం అసంబద్ధ విధానంపై పోరాడుదాం.. జాతీయ ఆహార సమగ్ర విధానాన్ని ప్రకటిచాలిః సీఎం కేసీఆర్
Cm Kcr
Balaraju Goud
|

Updated on: Nov 28, 2021 | 9:09 PM

Share

CM KCR Review on Paddy: ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ అస్పష్ట విధానం ఇటు తెలంగాణ రైతాంగానికి అటు దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి వున్నామని, అందుకు పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్దమైన, ద్వంద్వ వైఖరిని విడనాడాలని ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షత జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం డిమాండ్ చేసింది. తెలంగాణ వరిధాన్య సేకరణలో స్పష్టతకోసం పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేలా గళమెత్తాలని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శాసనసభా వ్యవహారాలు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ లో టీఆర్ఎస్ పక్ష నేత కే.కేశవరావు, కెప్టెన్ లక్ష్మీకాంత రావు, కే.ఆర్. సురేష్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్ సభ ఎంపీలు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ వానాకాలంలో వరిధాన్యం సాగు విస్తీర్ణం విషయంలో పూటకో మాట మాట్లాడుతూ కిరికిరి పెడుతూ, 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించవలిసి వుండగా, కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని( 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని) మాత్రమే సేకరిస్తామని కేంద్రం మల్లీ పాతపాటే పడుతున్నదని,. ఈ విషయంలో కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సిఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు, ఇటు తెలంగాణ మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ను, అటు సీఎస్ తో కూడిన ఉన్నతాధికారుల బృందం కేంద్ర ప్రభుత్వ అధికారులను పలుమార్లు కలిసి విజ్జప్తి చేసినా, ఎటూ తేల్చక పోవడం పై టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష సమావేశం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రానున్న యాసంగి పంటకాలం ప్రారంభమైన నేపథ్యంలో, తెలంగాణ రైతులు వరినాట్లకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాగే యాసంగి వరిధాన్యాన్ని ఎంత కొంటరో తేల్చి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా, ఇంకా నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానంపై సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉభయ సభల్లో తెలంగాణ రైతులు, ప్రజల తరపున గళాన్ని వినిపించాలని పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. వార్షిక ధాన్యసేకరణ కేలండర్ ను విడుదల చేయాలని సీఎంకేసీఆర్ చేసిన డిమాండ్ ను అభినందిస్తూనే, ఎటూ తేల్చని కేంద్రం వైఖరిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం విస్మయం వ్యక్తం చేసింది. పార్లమెంటులో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ విధానం పై పోరాడాలని నిర్ణయించింది.

ధాన్యం దిగుబడిలో అనతి కాలంలో తెలంగాణ రైతు దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో, కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ వ్యవసాయ రంగానికి ఆశనిపాతంగా మారిందని సమావేశం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆహార ధాన్యాల సేకరణ విషయంలో కేంద్రానికి జాతీయ విధానం ఉండాలని., దేశంలోని అన్ని రాష్ట్రాలకు ధాన్యం సేకరణ విషయంలో ఏకరీతి విధానాన్ని అనుసరించాలని, ‘‘ సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం’’ ( Uniform National FoodGrain Procurement Policy ) కోసం పార్లమెంటులో డిమాండ్ చేయాలని సీఎం కేసీఆర్ ఎంపీలను ఆదేశించారు.

Read Also….  Heavy Rains: అల్పపీడన నేపథ్యంలో ఏపీలోని ఆ జిల్లాలకు భారీవర్షాల హెచ్చరిక.. రేపు స్కూళ్లకు సెలవు