Milk Benefits: ఈ పదార్థాలతో కలిపి పాలను అసలు తీసుకోవద్దు.. ఏఏ సమయంలో వేడి పాలను తీసుకోవాలో తెలుసా..
పాలు రోజూ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటుంటారు. అందుకే చిన్నప్పటి నుంచి పాలను ఎక్కువగా తాగిస్తారు. అలాగే పాలు
పాలు రోజూ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటుంటారు. అందుకే చిన్నప్పటి నుంచి పాలను ఎక్కువగా తాగిస్తారు. అలాగే పాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. శరీరంలో కాల్షియం లోపం ఉన్నవారు పాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా.. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అలాగే ఆకలిగా ఉన్నప్పుడు పాలు తీసుకోవడం మంచిది. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి1, బి2, బి12, డి, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక అంశలున్నాయి. కానీ పాలను ఏ సమయంలో తాగాలి అనే విషయంపై ఎవరికి సరైన అవగాహాన ఉండదు. సరైన సమయంలో పాలు తీసుకోకపోవడం వలన శరీరంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అలాగే కొన్ని పదార్థాలను పాలతో కలిపి అసలు తీసుకోవద్దు. ఏంటో తెలుసుకుందామా.
ఆయుర్వేదం ప్రకారం సిట్రస్ పండ్లతో కలిపి పాలను అసలు తీసుకోవద్దు. అలాగే మామిడి, అరటిపండ్లు, సీతాఫలాలు, ఇతర సిట్రస్ పండ్లతో పాలు లేదా పెరుగు కలిపి తినకూడదు. ఆయుర్వేదం ప్రకారం అరటి పండును పాలతో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ప్రేగులలోకి వెళ్లి సమస్యను తీవ్రం చేస్తుంది. అరటిపండును పాలతో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, అలర్జీ, శరీరంపై ఎర్రటి దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఎముకలను బలంగా చేయాలనుకుంటే పాలను ఉదయాన్నే తీసుకోవాలి. ఇక రాత్రిళ్లు నిద్ర సరిగ్గా లేకపోతే పడుకునే ముందు అశ్వగంధతో పాలు తీసుకోవాలి. ఇది జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా మంచి నిద్రను అందిస్తుంది. ప్రతి వ్యక్తి పాలు తప్పనిసరిగా తాగాలి. పాలు అలర్జీ ఉన్నవారు తీసుకోవద్దు…ఇక ప్రతి రోజూ ఆహారం తీసుకున్న తర్వాత నిద్రకు అరగంట ముందు పాలు తాగాలి. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
పాలు అలెర్జీ ఉన్నవారు ఉదయాన్నే పాలు తీసుకోవద్దు. వీరు తాగితే జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడతాయి. అలాగే అలసటగా ఉంటారు. ఇక 5సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగకూడదు. ఇదిఅసిడిటీని పెంచుతుంది. అలాగే పాలలో ఉప్పు కలిపి తీసుకోవద్దు.
రాత్రిళ్లు పాలు తాగడం వలన ప్రయోజనాలు.. రాత్రిళ్లు పాలు తాగడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత నిద్రకు అరగంట ముందు పాలు తీసుకోవాలి. దీంతో జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా జీర్ణవ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. అలాగే శరీరానికి కాల్షియంను అందిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Also Read: Ariyana: రాజ్ తరుణ్ అంటే అస్సలు నచ్చదు.. అరియానా షాకింగ్ కామెంట్స్..
Bigg Boss 5 Telugu Promo: ప్రియాంకకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బిగ్బాస్.. హౌస్లో నామినేషన్స్ హీట్..