AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: శివాలయంలో అద్భుతం… చేద బావి నుంచి సలసలా మరిగే వేడి నీళ్లు

సహజంగా ఏ బావిలో నుంచి అయినా చల్లని నీరు వస్తుంది. కానీ ఓ గ్రామంలోని ఆలయంలో ఉన్న బావిలో మాత్రం పగలు రాత్రి అనే తేడా లేకుండా వేడి నీరు వస్తుంది.

Telangana: శివాలయంలో అద్భుతం... చేద బావి నుంచి సలసలా మరిగే వేడి నీళ్లు
Hot Water From Well
Ram Naramaneni
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 29, 2021 | 5:59 PM

Share

సహజంగా ఏ బావిలో నుంచి అయినా నీరు చల్లగా ఉంటుంది. కానీ ఓ గ్రామంలోని ఆలయంలో ఉన్న బావిలో మాత్రం పగలు రాత్రి అనే తేడా లేకుండా వేడి నీరు ఉంటుంది. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. దీంతో ఈ వింతను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతనమైన శివాలయం ఉంది. ఆలయంలో పనిచేసే గ్రామస్థురాలు సుగుణ తొలుత బావిలో నీళ్లు చేదగా.. వేడిగా ఉండటం గమనించింది. ఆ తర్వాత ఆమె విషయాన్ని ఆలయ పూజారికి, గ్రామస్థులకు తెలిసింది. వారు కూడా వచ్చి చూసి.. ఆశ్చర్యపోయారు. బావిలో నుంచి చేదిన నీరు పట్టుకుంటే చేతులు కాలిపోయంత వేడిగా ఉండటంతో.. అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఏకంగా నాలుగు నెలల నుంచి నీరు ఇలా వేడిగా ఉంటున్నాయట. ఇది శివుని మహిమ అని భావించిన భక్తులు బావికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పురాతన శివాలయాన్ని పునరుద్ధరించాలని గతంలో గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకుని పట్టించుకోలేదని.. అందుకే ఇలా జరిగిందని కొందరు గ్రామస్థులు అంటున్నారు.

ఈ బావి నీరు తాగడం వలన రోగాలు మటు మాయమవడమేకాకుండా ఆరోగ్యంగా జీవిస్తారని గ్రామస్థుల ప్రగాడ విశ్వాసం. ఊరి ప్రజలను చల్లంగా చూస్తున్న శివుడు.. ఆలయ బావిలో నుంచి సలసల మరిగే వేడి నీరును సంకేతంగా పంపడానికి గల కారణాలను వారు విశ్లేషించుకుంటున్నారు. గ్రామంలోని అన్ని బావుల్లో వస్తున్న చల్లని ఊటకు బదులు ఈ బావిలో వేడి ఊట నీరు రావడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఎందువల్ల ఇలా జరిగిందో ప్రభుత్వం, శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. కాగా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో శివయ్యను దర్శించుకునేందకు ఇక్కడికి వచ్చే భక్తుల ఈ వింతను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Also Read: ఓయూలో సమాధి కలకలం.. టెన్షన్‌లో విద్యార్థులు

బార్‌లో యాక్షన్ హీరో.. డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో ‘స్వాతిముత్యం’లో కమల్ హాసన్