YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. తెరపైకి కొత్తగా గంగాధర్‌ రెడ్డి కామెంట్స్..

వైఎస్ వివేకా మర్డర్ కేసు. మూడేళ్లుగా అనేక మలుపు, ఊహించని కుదువులు. సిబిఐ విచారణ జరుగుతున్న క్రమంలో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్‌ చోటు చేసుకుంటుందో ఊహాకందడం లేదు. తాజాగా గంగాధర్ రెడ్డి తెరపైకి వచ్చాడు.

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. తెరపైకి కొత్తగా గంగాధర్‌ రెడ్డి కామెంట్స్..
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 29, 2021 | 6:12 PM

వైయస్ వివేకా హత్య కేసులో రోజుకో మలుపు. గంటకో వార్త సంచలనం రేకెత్తిస్తోంది. తాజాగా మరో ట్విస్టు.. సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. కొత్తగా గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. వైఎస్ అవినాష్ రెడ్డి తో పాటు మరికొందరిని ఈ కేసులో ఇరికించేలా తనపై ఒత్తిడి తెస్తున్నారని అనంతపురం జిల్లా యాడికికి చెందిన గంగాధర్ రెడ్డి జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. వైయస్ వివేకా కూతురు సునీతతో పాటు మరికొందరు అనుచరులు తనను బెదిరిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గతంలో కూడా సీబీఐ అధికారులు, ప్రస్తుత సిఐ శ్రీరామ్ తనను తీవ్రంగా వేధించారని గంగాధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. కొత్తగా గంగాధర్ రెడ్డి వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఇంతకీ ఇతను ఎవరన్న అనుమానం అందరికీ రావచ్చు, ఎన్ని రోజుల తర్వాత ఈ కొత్త ఫేస్ ఎందుకు తెరపైకి వచ్చిందన్న డౌట్ సహజంగానే అందరని వేధించవచ్చు. పుట్టింది పులివెందుల, ఉండేది అనంతపురం జిల్లా యాడికి. ఇంతకు నువ్వు ఎవరయ అంటే దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనుచరుడని అని చెప్తు్న్నాడు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరిని ఈ కేసులో ఇరికించేలా తనపై ఒత్తిడి తెస్తున్నారని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశాడు గంగాధర్ రెడ్డి. వైయస్ వివేకా కూతురు సునీతతో పాటు మరికొందరు అనుచరులు తనను బెదిరిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

వివేకను హత్య చేసేందుకు దేవిరెడ్డి శంకర్ రెడ్డి 10 కోట్లు రూపాయలు ఆఫర్ చేసినట్లు సిబిఐ ముందు ఒప్పుకోవాలని వివేక అనుచరులు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు గంగాధర్ రెడ్డి. ఈ క్రమంలో పక్కా ప్లాన్ అల్లి, ఆ కథ మొత్తం సిబిఐ ముందు చెప్పాలని ఒత్తిడి పెంచారని చెప్తు్న్నారు. వివేకను హత్య చేసేందుకు దేవిరెడ్డి శంకర్ రెడ్డి 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. వివేక ఇంట్లో దొంగతనానికి వెళ్తే అతను ఎదురుతిరిగే సరికి హత్య చేసి డెడ్‌బాడీని బాత్‌రూంలో పడేసినట్లు.. ఇదంతా శంకర్ రెడ్డి ప్లాన్ అంటూ సిబిఐ ముందు చెప్పాలని వివేక అనుచరులు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు గంగాధర్ రెడ్డి.

గతంలో కూడా సీబీఐ అధికారులు, ప్రస్తుత సిఐ శ్రీరామ్ తనను తీవ్రంగా వేధించారన్నది గంగాధర్ రెడ్డి ఆరోపణ. ఇందుకు తను ఒప్పుకోకపోవడంతో డబ్బు కూడా ఇస్తామని చెప్పారని అంటున్నారు గంగాధర్ రెడ్డి. ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ సారాంశాన్ని మీడియాకు వివరించారు ఫకీరప్ప.

వివేకా హత్య కేసులో రీసెంట్‌గా దేవిరెడ్డి శంకర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ మర్డర్‌తో తనకేం సంబంధంలేదు.. హత్యకు కారణాలేంటి, కారకులెవరో వివేకా కూతురు సునీతకు అన్నీ తెలుసంటూ సీబీఐకి లేఖరాశారాయన. ఆమె పదే పదే సీబీఐని కలుస్తూ విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హత్యకు ముందు, హత్య జరిగిన రోజు ఘటనలపై అనుమానాలు వ్యక్తం చేశారు. మర్డర్ కేసులో దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, వాచ్‌మ్యాన్‌ రంగయ్య సహా చాలా మందిని ఇప్పటికే సీబీఐ విచారించింది. దస్తగిరి కన్ఫెన్షన్‌ రిపోర్ట్‌తో ఎంపీ అవినాష్‌ రెడ్డి పాత్రపై రాజకీయ దుమారం చెలరేగింది.

ఇవి కూడా చదవండి: Omicron Variant: ఆందోళనకు గురి చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. అసలు ఇది ప్రాణాంతకమా? కాదా?..

Telangana: శివాలయంలో అద్భుతం… చేద బావి నుంచి సలసలా మరిగే వేడి నీళ్లు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?