Betting Mafia: తెలంగాణలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా.. ఇద్దరు బుకీల అరెస్ట్.. రూ.2 కోట్లు స్వాధీనం
Betting Mafia: ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్, పేకాట బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని వరంగల్ కేయూసీ పోలీసులు పట్టుకున్నారు. ముంబై కేంద్రంగా ఆన్‌లైన్ ద్వారా భారీగా బెట్టింగ్‌లు
Telangana Cricket Betting Mafia: ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్, పేకాట బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని వరంగల్ కేయూసీ పోలీసులు పట్టుకున్నారు. ముంబై కేంద్రంగా ఆన్‌లైన్ ద్వారా భారీగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసీ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ.రెండు కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లాకు చెందిన మాడిశెట్టి ప్రసాద్, మహారాష్ట్రకు చెందిన అభయ్ అనే ఇద్దరు బుకీలు ముంబై కేంద్రంగా ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్, పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.05 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతోపాటు నిందితుల వద్దనున్న వివిధ బ్యాంకులకు చెందిన 43 పాసుపుస్తకాలు, ఏటీఎం కార్డులు, ఏడు సెల్‌ఫోన్లను సీజ్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు.
అరెస్టయిన నిందితుడు ప్రసాద్ హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో దుస్తుల వ్యాపారం నిర్వహించేవాడన్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో 2016 నుంచి క్రికెట్, పేకాట బెట్టింగ్ ప్రారంభించాడని తెలిపారు. ఈ క్రమంలో ముంబై కేంద్రంగా ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహించే మరో నిందితుడు అభయ్‌తో.. ప్రసాద్‌కు పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ తర్వాత కొంతమంది స్నేహితులతో కలిసి 2016 నుంచి క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. అయితే.. బెట్టింగ్ పెట్టిన వారిని ముందుగా గెలిపించేవారు. అనంతరం వారితో ఎక్కువ మొత్తంలో డబ్బు పందెం కాసేలా చేసి.. ఓడిపోయేలా ప్రణాళికలు చేసే వారని వెల్లడించారు.
నిందితులు ఇలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినట్లు తెలిపారు. ఈ బెట్టింగ్ మాఫియాతో గత మూడు నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది మోసపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో మరింత సమచారం కోసం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు కేయూసీ పోలీసులు వెల్లడించారు.
Also Read: