Murder: సినిమాను తలపించే మర్డర్ స్టోరీ.. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడని భర్త దారుణ హత్య.. ముక్కలుగా కోసి..

Crime News: భార్య వివాహేతర సంబంధం.. భర్త ప్రాణాలను బలిగొంది. భార్య అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్తను.. ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత సినిమా స్టోరీని తలపించే

Murder: సినిమాను తలపించే మర్డర్ స్టోరీ.. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడని భర్త దారుణ హత్య.. ముక్కలుగా కోసి..
Crime News

Crime News: భార్య వివాహేతర సంబంధం.. భర్త ప్రాణాలను బలిగొంది. భార్య అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్తను.. ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత సినిమా స్టోరీని తలపించే విధంగా మృతదేహాన్ని ఏడు ముక్కలుగా కోసి పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ హత్య ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో హతుని భార్యతో పాటు నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మీసేవ ఉద్యోగిగా పని చేస్తున్నాడు కాంపల్లి శంకర్. 16 సంవత్సరాల క్రితం హేమలత అనే మహిళతో శంకర్‌కు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు.

అయితే.. తనపై అనుమానంతో తరచూ వేధింపులకు పాల్పడుతున్నాడంటూ శంకర్‌పై భార్య హేమలత గతంలన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే.. ఎన్‌టీపీసీ హాస్పిటల్లో హెడ్ నర్సుగా పని చేస్తున్న హేమలత.. అదే ఆసుపత్రిలో స్వీపర్‌గా పని చేస్తున్న పోయిల రాజు అనే యువకుడితో చనువుగా ఉంటున్నట్లు భర్త శంకర్‌కు తెలిసింది. ఈ విషయమై శంకర్ పోయిలరాజుకు ఫోన్ చేసి మందలించాడు. ఈ వ్యవహారం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. ఇద్దరు తాగిన మత్తులో గొడవ పడ్డారు. అనంతరం రాజు ఆవేశంతో శంకర్ తలపై బీరు సీసాతో దాడి చేశాడు. ఈ దాడిలో శంకర్ అక్కడికక్కడే కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. దీంతో శంకర్ మరణించాడని భావించిన రాజు.. శవాన్ని సినిమా ఫక్కీలో మాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

పోలీసులకు దొరకకుండా ఉండాలనే భావనతో శంకర్ శరీరాన్ని ఏడు ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. హత్య జరిగిన మరుసటి రోజు హంతకుడు రాజు హేమలతకు ఈ విషయం చెప్పగా.. ఆమె కూడా ఈ హత్యను సమర్థించి ప్రియుడికి అండగా నిలిచింది. అయితే.. మాల్యాలపల్లి చెట్లపొదల్లో ఓ వ్యక్తి చేతులు నరికి పడేసి ఉన్నాయని స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత తల, శరీర భాగాలు పలు చోట్ల లభ్యమయ్యాయి. అయితే.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును ఛేదించారు. దర్యాప్తు అనంతరం నిందితుడు రాజుతో పాటు హతుని భార్యను కూడా అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కాగా.. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించింది.

జి. సంపత్ కుమార్, టీవీ9 తెలుగు రిపోర్టర్, కరీంనగర్

Also Read:

Ramagundam: సంచలనం.. రోడ్డు పక్కన వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు..

Tomatoes Stolen: టమాట దొంగలు.. పక్కా ప్లాన్ వేసి ఎత్తుకెళ్లారు.. ఏపీలో కలకలం..


Published On - 4:17 pm, Mon, 29 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu