Ramagundam: సంచలనం.. రోడ్డు పక్కన వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు..

పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం కుందనపల్లిలో కలకలం చెలరేగింది.  రోడ్డు పక్కన కనిపించిన దృశ్యం చూసి స్థానికులు షాక్ తిన్నారు.

Ramagundam: సంచలనం.. రోడ్డు పక్కన వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు..
Women Death
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 27, 2021 | 10:24 AM

పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం కుందనపల్లిలో కలకలం చెలరేగింది.  రాజీవ్ రహదారి పక్కన ఓ వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు కనిపించాయి. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే  పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మొండెం లేని తలను, 2 చేతులను గుర్తించారు. కానీ ఆ చేతులు రెండు వేర్వేరు వ్యక్తులకు చెందినవిగా చెబుతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు.. ఇంకో చేయి ఎవరిది అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు హత్య చేశారు? ఇంకో వ్యక్తి డెడ్‌బాడీ ఎక్కడుందోననే విషయాలు ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.

బాలికపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పోక్సో కేసుల స్పెషల్ కోర్టు శిక్షను విధించింది. తెలంగాణలోని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లికి చెందిన నిందితుడు తోడేటి రమేశ్​కు… 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4వేలు ఫైన్ విధిస్తూ తీర్పు వెలువరించింది.

2018 అక్టోబర్​ 12న నిందితుడు రమేశ్​.. 8 ఏళ్ల బాలికకు గుట్కా తీసుకురమ్మని కిరాణా షాపుకు పంపాడు. గుట్కా తెచ్చిన బాలికను ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు కంప్లైంట్ చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై అచ్యాచార కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఘటనకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించారు. అప్పటి ములుగు డీఎస్​పీ విజయ సారథి నిందితుడిని అరెస్టు చేసి.. ఛార్జిషీట్​ ఫైల్​ చేశారు. అనంతరం కోర్టు డ్యూటీ ఆఫీసర్​ వి.రవీందర్​ సాక్ష్యులను ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్​ తరఫున పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ సీహెచ్​ సత్యనారాయణ వాదించారు. బాధిత బాలిక సాక్ష్యంతో పాటు, పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యులు, ఆధారాలు పరిశీలించిన కోర్టు నిందితుడు రమేశ్​ను దోషిగా తేల్చి తుది తీర్పు వెలువరించింది.

Also Read: మళ్లీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోన్నరాయలచెరువు.. వరుస లీకేజీలు

కృష్ణా జిల్లాలో మోహన్ బాబు పర్యటన.. సీఎం జగన్‌ను కలిసే అవకాశం