Mexico Bus Accident: తీర్థయాత్రకు వెళ్తుండగా విషాదం.. బ్రేకులు ఫెయిలై భవనంలోకి దూసుకెళ్లిన బస్సు.. 19మంది మృతి
సెంట్రల్ మెక్సికోలో ఓ బస్సు బ్రేకులు ఫెయిలై భవనంపైకి దూసుకెళ్లిన దుర్ఘటనలో 19 మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు.
Mexico Road Accident: మెక్సికో ఘోర రోడ్డుప్రమాదం జరగింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. సెంట్రల్ మెక్సికోలో ఓ బస్సు బ్రేకులు ఫెయిలై భవనంపైకి దూసుకెళ్లిన దుర్ఘటనలో 19 మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. యాత్రికులు తీర్థయాత్రకు బస్సులో వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీకి నైరుతి దిశలో ఉన్న జోక్విసింగో టౌన్‌షిప్‌లో ఈ ప్రమాదం జరిగిందని సెంట్రల్ మెక్సికో రాష్ట్ర అంతర్గత కార్యదర్శి రికార్డో డి లా క్రూజ్ తెలిపారు. బస్సు పశ్చిమ రాష్ట్రమైన మిచోకాన్ నుంచి రోమన్ క్యాథలిక్ యాత్రికులు సందర్శించే చల్మా పట్టణానికి వెళుతోండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని రాష్ట్ర రాజధాని నగరమైన టోలుకాలోని ఆసుపత్రికి తరలించారు. మెక్సికోలో ఇరుకు రోడ్లతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
రోమన్ క్యాథలిక్ యాత్రికులు బస్సులో పశ్చిమ రాష్ట్రమైన మిచోకాన్ నుండి చల్మా పట్టణానికి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాష్ట్ర రాజధాని టోలుకాలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ప్రయాణికుల పరిస్థితిపై తక్షణ సమాచారం లేదు. చాలా మంది మెక్సికన్లు డిసెంబర్ 12, వర్జిన్ ఆఫ్ గ్వాడాలుపే రోజు సమీపిస్తున్న కొద్దీ మతపరమైన తీర్థయాత్రలకు వెళతారు. వారు తరచుగా ఇరుకైన రోడ్లపై నడవడం, కాలం చెల్లిన బస్సులలో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 1521 ఆక్రమణకు ముందు హిస్పానిక్ పూర్వ కాలంలో చల్మా ఒక పవిత్ర ప్రదేశం. స్పానిష్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అజ్టెక్ దేవుడికి అంకితం చేయబడిన ఒక గుహలో ఒక శిలువ అద్భుతంగా కనిపించింది. ఇది చల్మాను క్రైస్తవ తీర్థయాత్రగా మార్చింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు చల్మాను దర్శించుకునేందుకు తరలివస్తుంటారు.