Kamanchi Plant: కలుపు మొక్కలో క్యాన్సర్‌ తగ్గించే ఔషధాలు.. పేటెంట్‌ రైట్స్‌ కోసం పోటీపడుతున్న దేశాలు..(వీడియో)

Kamanchi Plant: కలుపు మొక్కలో క్యాన్సర్‌ తగ్గించే ఔషధాలు.. పేటెంట్‌ రైట్స్‌ కోసం పోటీపడుతున్న దేశాలు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 27, 2021 | 10:00 AM

ప్రకృతి ఇచ్చిన వరం మొక్కలు. అయితే మనం రోజూ చూసే.. కలుపు మొక్కల్లా కనిపించే వాటిలో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయన్న విషయం మనకు తెలియదు. అలాంటి ఒక మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.


ప్రకృతి ఇచ్చిన వరం మొక్కలు. అయితే మనం రోజూ చూసే.. కలుపు మొక్కల్లా కనిపించే వాటిలో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయన్న విషయం మనకు తెలియదు. అలాంటి ఒక మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఎన్నో ఔషధాల గనిగా ఈ మొక్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మొక్క పేటెంట్‌ రైట్స్‌ కోసం అమెరికా సైతం పోటీ పడుతోంది. అదేవిటో.. దాని విశిష్ఠత ఏవిటో తెలుసుకుందాం.

ట‌మాటా జాతికి చెందిన కామంచి మొక్కని.. కామాక్షి మొక్క అని కూడా అంటారు. చూడడానికి ఇది మిర‌ప చెట్టులా ఉంటుంది. దీని పండ్లు చిన్నసైజు టమాటాల్లా నలుపు రంగులో ఉంటాయి. ఈ మొక్కలో అద్భుత ఔషధగుణాలు ఉన్నాయి. క్యాన్సర్‌, కాలేయ వ్యాధుల చికిత్సకు కామంచి మొక్క ఆకులు ఉపయోగపడతాయని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (ఆర్‌జీసీబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే ఈ మొక్కపై పేటెంట్ హక్కుని కూడా తీసుకున్నారు. ఈ మొక్క ఆకులను రసం తీసుకుని, కొంచెం జీలకర్ర పొడి, మిర్యాల పొడి కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే… లివ‌ర్ క్లీన్‌ అవటమే కాకుండా కామెర్లని నివారిస్తాయట. *ఈ మొక్క ఆకుల రసం యాంటీసెప్టిక్ గానూ పనిచేస్తుందట.

ఇక *సీజనల్ వ్యాధులైన దగ్గు, జ్వరం, ఆస్తమా నివారణకు కామంచి మొక్క ఆకుల రసం దివ్యౌషధం అనే చెప్పాలి. ఈ ఆకుల ర‌సాన్ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇంకా ఈ ఆకు రసం విషహారిని కూడా.. తేలు కాటు వేస్తే వెంటనే కామంచి ఆకుల రసం తేలు కాటువేసిన ప్రాంతంలో అప్లై చేస్తే విషాన్ని హరించివేస్తుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది, కామంచి పండ్లను రోజూ తింటే నోటిపూతనుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మొక్క ఆకుల‌ను కూర‌గా వండుకుని తింటే రేచీక‌టి త‌గ్గుతుంది. *ఈ మొక్క భాగాలను నీళ్లలో కాచి డికాక్షన్ తాగితే గుండె జబ్బులను నివారిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ మొక్క ఆకుల్లో క్యాన్సర్ల‌ను త‌గ్గించే ఔషధ‌గుణాలు ఉన్నాయ‌ని ఇటీవలే శాస్త్రవేత్తలు తేల్చారు. అందుకు సంబంధించి వారు పేటెంట్ హ‌క్కుల‌ను కూడా తీసుకున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 27, 2021 09:59 AM