బ్యాంకు ఖాతాలో నామినీ పేరు ఎందుకు చేర్చాలి ?? వీడియో
మీరు ఏదైనా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినా.. వివిధ రకాల స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేసినా.. ఎల్‌ఐసీ, ఇతర జీవిత బీమాలు, ఈపీఎఫ్ తదితరాలలో నామినీ పేరు నమోదు చేయడం తప్పనిసరి.
మీరు ఏదైనా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినా.. వివిధ రకాల స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేసినా.. ఎల్‌ఐసీ, ఇతర జీవిత బీమాలు, ఈపీఎఫ్ తదితరాలలో నామినీ పేరు నమోదు చేయడం తప్పనిసరి. అయితే.. చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అన్నీ కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ.. పెట్టుబడిదారుడికి అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే నామినీ పేరు చేర్చడం ఎంతో ముఖ్యమని గుర్తించాలి. నిజానికి నామినీ.. చట్టబద్ధమైన వారసులు వేర్వేరు.. పెట్టుబడులు వారసులందరికీ చేరేందుకు.. నామినీ ఒక వారధి మాత్రమే. అంటే.. పెట్టుబడిదారుడికి ఏదైనా జరిగినప్పుడు అతని తరఫున వారసులకు వాటిని బదిలీ చేసే వ్యక్తి అన్నమాట. అందుకే నామినీగా సొంత వారినే కాదు.. బయట వారినీ నియమించుకునే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
చేపలకు తన నోటితో ఆహారం అందిస్తోన్న బాతు !! సో క్యూట్ !! వీడియో
రెండు ఎలుగుబంట్ల మధ్య భీకర ఫైట్ !! ఎప్పుడైనా చూశారా ?? వీడియో
పైకి చూస్తే భారీ బంగాళదుంప !! అసలు విషయం తెలిస్తే షాకే !! వీడియో
పాప ఎక్కువ చేస్తుంది !! అవసరమా నీకు ?? వీడియో