LPG Subsidy: గ్యాస్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై రూ.587కే సిలిండర్.. సబ్సిడీ పొందండి ఇలా..
LPG Cylinder Subsidy: దేశంలో గతకొంతకాలంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యులను అతలాకుతలం చేసింది. నిత్యవసరాల ధరలతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతోపాటు వంట గ్యాస్ ధర
LPG Cylinder Subsidy: దేశంలో గతకొంతకాలంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యులను అతలాకుతలం చేసింది. నిత్యవసరాల ధరలతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతోపాటు వంట గ్యాస్ ధర కూడా పెరిగింది. ఇటీవల కాలంలో గ్యాస్ ధర ఎన్నడు లేనంతగా రూ.900లకు చేరుకుంది. పెరుగుతున్న నిత్యవసర సరుకులతోపాటు గ్యాస్ సిలిండర్ రూ.900 కొనుగోలు చేయడం సామాన్యులకు కొంత భారంగా మారింది. అయితే.. కొంతకాలంగా ప్రభుత్వం ఇస్తున్న గ్యాస్ సబ్సిడీ కూడా రాకపోవడంతో ఇది మరింత భారమైంది. కేంద్రం అందిస్తున్న సబ్సిడీ కొంతకాలంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పు సబ్సిడీ గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. గ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు కూడా అందాయి. ఇది ప్రస్తుతం పరిశీలనలో ఉందని సమాచారం. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో డొమెస్టిక్ గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు. వీటితోపాటు.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని దేశం మొత్తం అందించేందు ప్రణాళిక చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) గ్యాస్ డీలర్‌లకు రూ.303 సబ్సిడీ ఇస్తారు. దీంతో గృహ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.303 తగ్గింపు ఇచ్చే అవకాశముంది. దీంతో గృహ సిలిండర్‌పై రూ.303 సబ్సిడీతో.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రూ. 587కి అందుబాటులో ఉండనుంది. అయితే.. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.900 ఉంది. ఇలాంటి పరిస్థితిలో.. గ్యాస్ సబ్సిడీని పొందడానికి మీ గ్యాస్ కనెక్షన్‌తో మీ ఆధార్ నంబర్‌ను లింక్ చేయడానికి మీరు మీ గ్యాస్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ఆధార్‌ను లింక్ చేసిన తర్వాత మీరు మీ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ మొత్తాన్ని పొందుతారు. దీంతోపాటు నగదు జమ అయిన సమాచారం గురించి సందేశం కూడా వస్తుంది.
మొబైల్‌తో గ్యాస్ కనెక్షన్‌ని ఎలా లింక్ చేయాలి.. మీ గ్యాస్ కనెక్షన్‌ని మొబైల్‌తో లింక్ చేయడానికి, మీ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించండి. అక్కడ మీరు మొబైల్‌తో గ్యాస్ కనెక్షన్‌ని లింక్ చేసే ఎంపికను చూస్తారు. దానిపై క్లిక్ చేసి.. మీ 17 అంకెల LPG IDని నమోదు చేయాలి. ఆ తర్వాత వెరిఫై చేసి సబ్మిట్ చేయండి. బుకింగ్ తేదీతో సహా అన్ని ఇతర సమాచారాలను పూరించాలి. దీని తర్వాత మీరు సబ్సిడీకి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.
LPG సబ్సిడీ కస్టమర్ కేర్ నంబర్‌ను తనిఖీ చేయండి.. దీంతోపాటు 1800-233-3555 కస్టమర్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా (LPG సబ్సిడీని తనిఖీ చేయండి) సబ్బిడీ గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. 2020 సంవత్సరంలో చివరిసారిగా లభించిన రూ.147.67 సబ్సిడీని ప్రభుత్వం ఏప్రిల్ 2020లో అందించింది. ఆ సమయంలో సిలిండర్ ధర రూ.731 ఉంది. దీని తర్వాత డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.205 పెరిగింది. దీంతోపాటు ఇప్పుడు రూ.900 లకే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి వచ్చింది.
Also Read: