ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా బాటలోనే జియో.. డిసెంబర్ 1 నుంచి కొత్త రేట్లు.. ఏ కంపెనీ ప్లాన్స్ తక్కువగా ఉన్నాయో తెలుసా?

Airtel vs Vodafoneidea vs Jio: ఎయిర్‌టెల్, వీఐ (వోడాఫోన్-ఐడియా) తర్వాత జియో కూడా తన రీఛార్జ్ ప్లాన్‌లను పెంచేందుకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా బాటలోనే జియో.. డిసెంబర్ 1 నుంచి కొత్త రేట్లు.. ఏ కంపెనీ ప్లాన్స్ తక్కువగా ఉన్నాయో తెలుసా?
Jio Airtel And Vi Users
Follow us

|

Updated on: Nov 29, 2021 | 1:58 PM

ఎయిర్‌టెల్, వీఐ (వోడాఫోన్-ఐడియా) తర్వాత జియో కూడా తన రీఛార్జ్ ప్లాన్‌లను పెంచేందుకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. జియో తన ప్లాన్‌ను 21% వరకు పెంచుతున్నట్లు ప్రకటిచింది. కొత్త ప్లాన్ ధరలు డిసెంబర్ 1 నుంచి అమలు కానున్నట్లు పేర్కొంది. అంటే ఇకనుంచి రూ. 75 ప్లాన్ కోసం రూ.91 చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త ప్లాన్‌ల ధరలు.. రూ. 129 ప్లాన్ రూ. 155, రూ. 399 ప్లాన్ రూ. 479, రూ. 1,299 ప్లాన్ రూ. 1,559, రూ. 2,399 ప్లాన్ ప్రస్తుతం రూ. 2,879కి అందుబాటులో ఉంటాయి. డేటా టాప్-అప్ ధర కూడా పెరిగింది. కొత్త రేట్ల మేరకు 6 జీబీ డేటా రూ. 51కి బదులుగా రూ.61 పెంచారు. అలాగే 12 జీబీ డేటాకు రూ.101కి బదులుగా రూ.121 ఛార్జ్ చేయనున్నారు. ఇక 50 జీబీకి రూ.251కి బదులుగా రూ.301 చెల్లించాలి.

ఏ కంపెనీ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే.. జియో తన టారీఫ్ ప్లాన్స్ మార్చిన తరువాత కూడా మిగతా కంపెనీలతో పోల్చితే తక్కువ ధరలోనే నూతన ప్లాన్స్‌ను అందించనుంది. ఎయిర్‌టెల్, వీఐ ప్లాన్‌లతో పోల్చితే ఈవిషయం అర్థమవుతుంది. Airtel, Vi ప్లాన్‌లలో చాలా వరకు సమాన రేట్లతో ఉన్నాయి.

అత్యల్ప ఏఆర్‌పీయూ కంపెనీలను దెబ్బతీస్తుంది టెలికాం నిపుణులు, డైరెక్టర్, మహేష్ ఉప్పల్ మాట్లాడుతూ, “భారతదేశంలోని టెలికాం కంపెనీలు రెండు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మొదటిగా, కంపెనీల సగటు ఆదాయానికి వినియోగదారులు (ARPU) ప్రపంచంలోనే అత్యల్పంగా ఉన్నారు. కంపెనీలు ARPUని ఏదో ఒక విధంగా పెంచాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పెంచుతున్న రేట్లతో కంపెనీలకు యూజర్లు తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ టారిఫ్‌లను పెంచకుండా ఉంటే మాత్రం వ్యాపారం దెబ్బతింటుందని ఆయన తెలిపారు. రెండవ సమస్య ధరలు. చాలా మంది వినియోగదారులు టెలికాం ఖర్చులను ఒక స్థాయికి పెంచాలని కోరుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో పోటీ తక్కువగా ఉంది. కంపెనీలు డేటా ఆదాయంపై దృష్టి పెట్టేందుకు ఆలోచిస్తున్నాయి.

వ్యాలిడిటీ/డేటా ఎయిర్ల్‌టెల్ వీఐ జియో
28, 200 ఎంబీ 99 99 91
28, 2జీబీ 179 170 155
28, 1జీబీ/డే 265 269 179
28, 1.5జీబీ/డే 299 299 239
56, 2జీబీ 359 359 299
56, 1.5జీబీ/డే 479 479 479
56, 2జీబీ/డే 549 539 533
84, 6జీబీ 455 459 395

Also Read: Cyber Crimes: పెరిగిపోతోన్న సైబర్ నేరాలు.. ఇలా చేస్తే మీరు సేఫ్‎గా ఉంటారు..

AirAsia India: ఒకే గొడుకు కిందకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్ ఆసియా ఇండియా.. టాటా సన్స్‌ కీలక నిర్ణయం!