AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AirAsia India: ఒకే గొడుకు కిందకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్ ఆసియా ఇండియా.. టాటా సన్స్‌ కీలక నిర్ణయం!

యిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను, ఎయిర్‌ ఏషియా ఇండియాను విలీనం చేయాలని టాటా సన్స్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

AirAsia India: ఒకే గొడుకు కిందకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్ ఆసియా ఇండియా.. టాటా సన్స్‌ కీలక నిర్ణయం!
Airasia India Tata Sons
Balaraju Goud
|

Updated on: Nov 29, 2021 | 9:40 AM

Share

AirAsia India With Air India Express Merge: ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను, ఎయిర్‌ ఏషియా ఇండియాను విలీనం చేయాలని టాటా సన్స్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎయిర్‌ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్‌.. ఇప్పటికే ఎయిర్‌ ఏసియాలో 84 శాతం, విస్తారాలో 51 శాతం వాటాలను కలిగి ఉంది. ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటాను కొద్ది రోజుల క్రితం టాటా సన్స్‌ కొనుగోలు చేసిన సంగతి తేలిసిందే. తాజాగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్ ఆసియా ఇండియా విషయంలో టాటా సన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎయిర్‌ ఇండియా దాని అనుబంధ సంస్థ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఈ మధ్యే 100 శాతం వాటా కొనుగోలు చేసిన టాటా సన్స్‌ విమాన రంగంలో తన సత్తాను చాటేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది.. ఇందులో భాగంగా ఇప్పటికే తమ వాటాలు ఉన్న ఎయిర్‌ ఏసియా, విస్తారాలను కూడా లాభాల బాటలో నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఎయిర్‌ ఇండియా ఈ ఏడాది ఆఖరుకు టాటా సన్స్‌ ఆధీనంలోకి రానుంది. ఎయిర్‌ ఏసియాలో 84 శాతం, విస్తారాలో 51 శాతం వాటాలను కలిగి ఉంది ఈ గ్రూప్‌.. ఈ నేపథ్యంలో చౌక విమానయాన సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను, ఎయిరేషియా ఇండియాను విలీనం చేయాలని టాటా సన్స్‌ భావిస్తోంది. ఎయిర్ ఇండియా బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఇండియాఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్ ఆసియా ఇండియాతో విలీనం చేయాలని టాటా సన్స్ చూస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

అలాగే విస్తారా షెడ్యూళ్లను క్రమబద్దీకరించే విషయంలో భాగస్వామ్య సంస్థ సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో టాటాసన్స్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. టాటా సన్స్‌ గ్రూప్‌ పరిధిలోని విమానయాన కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు రావగడం వల్ల ఇబ్బందులు తగ్గి, వ్యయాలు కలిసివస్తాయని భావిస్తున్నారు. తమ పరిధిలోని ఈ సంస్థల సిబ్బందిని సమన్వయం చేసుకోవడం, నాణ్యత-భద్రతా పరీక్షల వంటి అంశాల్లో ఐక్యత సాధించేందుకు ఆయా సంస్థల ఉన్నతాధికారులతో టాటా సన్స్‌ ఇప్పటికే చర్చలు జరిపింది. సంస్థల విలీనంలో అంతర్జాయంగా ప్రావీణ్యం ఉన్న నిపుణులు ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, టాటా గ్రూపు ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకునే సమయం దగ్గర పడటంతో కార్యాచరణ ఖర్చులను తగ్గించాలని చూస్తోంది. విస్తారా, ఎయిర్ ఇండియాను కలిపి వేయడానికి సింగపూర్ ఎయిర్ లైన్స్(ఎస్ఐఎ)తో టాటా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. విస్తారాలో టాటాకు 51శాతం వాటం ఉండగా, మిగతా వాటా సింగపూర్ ఎయిర్ లైన్స్ కలిగి ఉంది. మొత్తం మీద విమానయాన కార్యకలాపాలన్నీ ఒకే హోల్డింగ్‌ కంపెనీ కిందకు తెచ్చేందుకే టాటా సన్స్‌ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.

Read Also…  Creativity: రాజ్యాంగ హక్కులు, చట్టాలతో పెళ్లి పత్రిక రాయించిన వరుడు.. నెట్టింట్లో వైరలవుతోన్న వెరైటీ వెడ్డింగ్‌ కార్డ్‌..