AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Creativity: రాజ్యాంగ హక్కులు, చట్టాలతో పెళ్లి పత్రిక రాయించిన వరుడు.. నెట్టింట్లో వైరలవుతోన్న వెరైటీ వెడ్డింగ్‌ కార్డ్‌..

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యముంది. లైఫ్‌లో ఒక్కసారి జరిగే ఈ వేడకను ఉన్నంతలో ఘనంగా చేసుకోవాలనుకుంటారు చాలామంది. అందుకే వెడ్డింగ్ కార్డుల ఎంపిక..

Creativity: రాజ్యాంగ హక్కులు, చట్టాలతో పెళ్లి పత్రిక రాయించిన వరుడు.. నెట్టింట్లో వైరలవుతోన్న వెరైటీ వెడ్డింగ్‌ కార్డ్‌..
Basha Shek
| Edited By: |

Updated on: Nov 29, 2021 | 6:04 PM

Share

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యముంది. లైఫ్‌లో ఒక్కసారి జరిగే ఈ వేడకను ఉన్నంతలో ఘనంగా చేసుకోవాలనుకుంటారు చాలామంది. అందుకే వెడ్డింగ్ కార్డుల ఎంపిక దగ్గరి నుంచి అప్పగింతలు పూర్తయ్యే వరకు ప్రతి విషయంలోనూ తమ ప్రత్యేకత చాటుకోవాలని భావిస్తారు. ఇందులో భాగంగా ఇటీవల సాధారణ పెళ్లి పత్రికలకు బదులు తమ భాష, సంస్కృతిని తెలియజేసేలా వెడ్డింగ్‌ కార్డ్‌లను రూపొందిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఇవి వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వెరైటీ వెడ్డింగ్‌ కార్డ్‌ నెట్టింట్లో వైరలవుతోంది. అసోంలోని గౌహతికి చెందిన అడ్వకేట్ అజయ్ శర్మ.. హరిద్వార్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న పూజా శర్మ ఆదివారం (నవంబర్‌28) పెళ్లిపీటలెక్కనున్నారు. అయితే తన పెళ్లికోసం వరుడు అజయ్ తన న్యాయవాద వృత్తిని ప్రతిబింబించేలా వెడ్డింగ్ కార్డును రాయించారు. రాజ్యాంగంలోని చట్టాలను పొందుపరుస్తూ రూపొందించిన ఈ వివాహ ఆహ్వాన పత్రికను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అన్ని వివరాలు చదవాలనే ఇలా… పెళ్లిపత్రికలో వధూవరుల సమానత్వాన్ని సూచించేలా న్యాయ దేవత చేతిలో ఉండే త్రాసులో ఇరువైపులా అజయ్‌- పూజ పేర్లను ప్రింట్ చేశారు. ఇక భారతీయ వివాహానికి సంబంధించిన చట్టాలు, హక్కులను కూడా ఈ వెడ్డింగ్‌ కార్డ్‌లో ప్రింట్‌ చేయించారు. ‘ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు పౌరులకు లభించే జీవించే హక్కులో ఒక భాగం. ఇప్పుడీ ప్రాథమిక హక్కును మేం వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 2028 నవంబర్‌ 28న నేను ఈ హక్కును ఉపయోగించుకుంటున్నాను. భారతీయ హిందూ సంప్రదాయ చట్టం- 1955 ప్రకారం వధూవరుల పరస్పర అంగీకారంతో ఈ శుభ కార్యం జరగనుంది. డిసెంబర్‌1న వెడ్డింగ్‌ రిసెప్షన్‌ జరగనుంది. కావున మీరందరూ కుటుంబ సమేతంగా మా పెళ్లికి హాజరై మమ్మల్ని ఆశీర్వదించండి ’ అని అజయ్ వెడ్డింగ్‌ కార్డ్‌ను రాయించారు. కాగా ఐదేళ్లుగా లా ప్రాక్టీస్ చేస్తున్నారు అజయ్‌. ఇందులో భాగంగా తన సహోద్యోగులతో చర్చించి ఇలాంటి స్పెషల్ ఇన్విటేషన్‌ కార్డును తయారుచేయించుకున్నాడు. ‘సాధారణంగా ఎవరికైనా పెళ్లి పత్రికను అందజేస్తే చాలామంది వివాహ వేదిక, సమయం, తేదీని మాత్రమే చూస్తారు. ఇతర వివరాలను పెద్దగా పట్టించుకోరు. పై నుంచి కింది వరకు పూర్తిగా చదవాలనే ఇలా వెరైటీగా పెళ్లి పత్రికలను ప్రింట్‌ చేయించాను’ అని చెబుతున్నారు అజయ్. కాగా ప్రస్తుతం ఈ వెడ్డింగ్‌ కార్డ్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదేమైనా పెళ్లి పత్రికా లేదా లాయర్‌ నోటీసా అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.

Also Read:

Anchor Ravi First Interview With TV9: ఎందుకు ఎలిమినేట్ అయ్యానో తెలీదు..!ఆసక్తికర వెల్లడించిన రవి.. (వీడియో)

Heavy Rain Alert ForAP: ఏపీకి దడ పుట్టిస్తున్న మరో వానగండం.. కొన్ని ప్రాంతాల్లో కంపిస్తున్న భూమి..(వీడియో)

Cat at GYM: ఫిట్ నెస్ కోసం జిమ్‌లో కష్టపడుతున్న పిల్లి.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్..