Cat at GYM: ఫిట్ నెస్ కోసం జిమ్‌లో కష్టపడుతున్న పిల్లి.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్..

Cat at GYM: సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు షేర్ చేసినా ఎక్కువగా నెటిజన్లను ఆకర్షించేవి.. ఫన్నీ వీడియోలు.  కుక్క, పిల్లి, గున్న ఏనుగుల వీడియోలు. ఎక్కువగా తమ పెంపుడు కుక్క,..

Cat at GYM: ఫిట్ నెస్ కోసం జిమ్‌లో కష్టపడుతున్న పిల్లి.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్..
Cat Exercise
Follow us
Surya Kala

|

Updated on: Nov 29, 2021 | 8:54 AM

Cat at GYM: సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు షేర్ చేసినా ఎక్కువగా నెటిజన్లను ఆకర్షించేవి.. ఫన్నీ వీడియోలు.  కుక్క, పిల్లి, గున్న ఏనుగుల వీడియోలు. ఎక్కువగా తమ పెంపుడు కుక్క, పిల్లి చేసే అల్లరిపనులను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమ సంతోషన్ని నెటిజన్లతో పంచుకుంటారు. ఎందుకంటే కొన్ని పిల్లులు, కుక్కలు తమ యజమానులు ఏ పనులు చేస్తే.. వాటిని తమదైన శైలి లో అనుసరిస్తూ.. అందంగా అందరినీ అలరిస్తాయి. తాజాగా ఓ పిల్లి ఫిట్ నెస్ కోసం జిమ్ లో కష్టపడుతుంది. అవును చాలామంది తమ శరీరం ఆరోగ్యంగా ఫిట్ గా ఉండడం కోసం రోజు నడక, జాగింగ్ వంటి తేలికపాటి వ్యాయామం చేస్తారు. మరికొందరు గంటల తరబడి.. జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తూ.. వర్క్ అవుట్లు చేస్తారు. ఎవరు ఎలా ఏమి చేసినా.. ముఖ్య ఉద్దేశ్యం..తమ శరీరం ఫిట్ ఉండాలనే.. మరి ఈ పిల్లి తాను మాత్రం మనిషి కంటే ఏమి తక్కువా అనుకుందేమో.. ఈ  పిల్లి జిమ్‌లో చేసిన పని.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ పిల్లి.. జిమ్ లో అచ్చం మనిషి చేసినట్లే పుష్‌ అప్‌లు చేసింది.  “క్యాట్‌ డూయింగ్‌ కిట్-అప్స్‌” అంటూ కామెంట్ జత చేసి పిల్లి వర్కౌట్ చేస్తున్న వీడియో ట్విట్టర్ వినియోగదారుడు పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.  కొంతమంది నా కంటే ఈ పిల్లి అద్భుతంగా పుష్‌ అప్‌లు చేస్తోంది’ అని కామెంట్ చేస్తే.. మరికొందరు ‘పిల్లి భలే చేస్తుందే.. బాడీబిల్డింగ్‌ పోటీలకు పంపాలి.. అని ఇంకొందరు ‘పుష్‌ అప్‌లతో తగ్గేదే లే! అంటున్న పిల్లి అంటూ రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా పిల్లి జిమ్ లో కష్టపడుతున్న వీడియో పై ఓ లుక్ వేయండి..

Also Read:  తామర మొగ్గలా కనిపించే అరుదైన ఈ వెల్లుల్లి ఇచ్చే ఆరోగ్యాలు ప్రయోజనాలు తెలిస్తే.. ఎక్కడ కనిపించినా వదలరు..