Himalayan Garlic: తామర మొగ్గలా కనిపించే అరుదైన ఈ వెల్లుల్లి.. దాని ప్రయోజనాలు తెలిస్తే.. ఎక్కడ కనిపించినా వదలరు..

Himalayan Garlic: భారతీయ వంటగది ఔషధ మూలికలు, సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటుంది. ఇవి వివిధ వ్యాధుల నుండి మానవ శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అయితే వంటింటిలో..

Himalayan Garlic: తామర మొగ్గలా కనిపించే అరుదైన ఈ వెల్లుల్లి.. దాని ప్రయోజనాలు తెలిస్తే.. ఎక్కడ కనిపించినా వదలరు..
Himalayan Garlic
Follow us
Surya Kala

|

Updated on: Nov 29, 2021 | 8:43 AM

Himalayan Garlic: భారతీయ వంటగది ఔషధ మూలికలు, సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటుంది. ఇవి వివిధ వ్యాధుల నుండి మానవ శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అయితే వంటింటిలో ఉండే వెల్లుల్లిని అందరికీ తెలిసిందే.. అయితే దీనికంటే మించిన ఔషధ గుణాలున్న వెల్లుల్లి హిమాలయ వెల్లుల్లి. ఈ వెల్లుల్లి గురించి అతితక్కువ మందికి తెలుసు. హిమాలయాల ఎత్తైన ప్రదేశాలలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే పండిస్తారు.  కాశ్మీరీ వెల్లుల్లి లేదా జమ్మూ వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. ఈ హిమాలయ వెల్లుల్లి సాధారణ వెల్లుల్లి కంటే దాదాపు 7 రేట్లు ఎక్కువ శక్తివంతమైనది. మన వెల్లుల్లి వలె అనేక పాయలు కలిసి ఒక గడ్డ లా ఉండదు.. కేవలం ఒకే ఒక్క వెల్లుల్లి రెబ్బ మాత్రమే ఉండి, సన్నని తామర మొగ్గలా ఉంటుంది. ఈ  హిమాలయ వెల్లుల్లి,  కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా నయం చేస్తుంది. చాలామందికి పరిచయం లేని అరుదైన హిమాలయ వెల్లుల్లి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:  హిమాలయ వెల్లుల్లి శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. మానవ శరీరంలో వెల్లుల్లి సమర్థవంతంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుందని నిరూపించబడింది. రోజూ 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి ఖాళీ కడుపుతో తింటే మంచి ఫలితం ఉంటుంది.

దగ్గు- జలుబు నయం చేస్తుంది హిమాలయ వెల్లుల్లి దగ్గు , జలుబును నయం చేయడంలో సహాయపడుతుంది. ఇతర వ్యాధుల బారిన పడే అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో అల్లినేస్ , అల్లిన్ అనే రసాయన సమ్మేళనాలు ఉన్నాయని నిరూపించబడింది, ఇవి అల్లిసిన్ అనే శక్తివంతమైన సమ్మేళనాన్ని సృష్టించడంలో సహాయపడతాయి. ఇవి దగ్గు, జలుబు తగ్గించడానికి సహాయపడతాయి. బ్యాక్టీరియా వల్ల కలిగే అనారోగ్యాల నుండి రక్షిస్తాయి.

క్యాన్సర్‌తో పోరాడుతుంది హిమాలయ వెల్లుల్లిలో డయాలిల్ ట్రైసల్ఫైడ్ అనే ఆర్గానోసల్ఫర్ సమ్మేళనం ఉంది. ఇది క్యాన్సర్ కణాలను చంపడానికి,  క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ వెల్లుల్లిని తీసుకోవడం వలన వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని 50% తగ్గిస్తుందని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.

షుగర్ ని నియంత్రిస్తుంది

హిమాలయ వెల్లుల్లి రోజూ 2 నుండి 3  క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంతేకాదు షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. ఇందులో ఉన్న అల్లిసిన్..  విటమిన్ బి మరియు థియామిన్‌లతో కలిసినప్పుడు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో మధుమొహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది.

గుండెకు మంచిది హిమాలయన వెల్లుల్లి శరీరంలోని ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇది రక్తం యొక్క సాంద్రతను తగ్గించడం ద్వారా గడ్డకట్టడం ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇందులో హైడ్రోజన్ సల్ఫైడ్ అనే రసాయన సమ్మేళనం.. కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. దీంతో రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Also Read:  నాటి రెడ్డి రాజుల వస్తువులను నేటి తరానికి తెలిసేలా కొండవీటి మ్యూజియం.. తాజాగా 3 పురాతన వస్తువులు అందజేత..