Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలిపోతుందా..? అయితే ఈ వీడియో మీ కోసమే..!

Hair Care Tips: ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలిపోతుందా..? అయితే ఈ వీడియో మీ కోసమే..!

Anil kumar poka

|

Updated on: Nov 29, 2021 | 9:44 AM

ప్రసవం తర్వాత మహిళలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో జుట్టు రాలడం కూడా ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. కొన్ని ఇంటి చిట్కాలతో మీరు జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు.. అవేంటో ఓసారి తెలుసుకుందాం..


ప్రసవం తర్వాత మహిళలు తీసుకునే ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రాబెర్రీలు, యాపిల్స్, బీన్స్, రేగు పండ్లను తరచూ తీసుకుంటే మంచిది. యాంటీఆక్సిడెంట్లు జట్టు మూలాలు బలోపేతం అయ్యేలా సహాయపడతాయి. తద్వారా జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చు. ఎల్లప్పుడూ స్కాల్ప్‌ను తేలికపాటి యాంటీ హెయిర్ లాస్ షాంపూతో శుభ్రంగా కడగాలి. జుట్టు రాలిపోకుండా ఉండేందుకు కండిషన్ చేయాలి. ముఖ్యంగా జుట్టును గట్టిగా లాగడం, కట్టడం లాంటివి మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ తలపైనున్న జుట్టుపై ఒత్తిడి కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ జుట్టు రాలిపోతుంది. గర్భధారణ తర్వాత మీ శరీరానికి కొన్ని సప్లిమెంట్లు అవసరం అవుతాయి. అవి మీకు శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం, మీరు విటమిన్ బి, సి వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జుట్టుకు రంగులు వేయడం, స్ట్రెయిట్ చేయడం, పెర్మ్ చేయడం వంటివి మానుకోవాలి. ఎందుకంటే వీటి కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంది. అవసరమైన సందర్భాల్లో ఇవన్నీ చేయొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ:
Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)

Published on: Nov 29, 2021 08:35 AM