- Telugu News Photo Gallery Cinema photos Nandamuri balakrishna unstoppable talk show photos goes trending in social media
Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)
నటసింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయ్యారు. బాలయ్య హోస్ట్ గా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఓ టాక్ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Updated on: Nov 01, 2021 | 10:08 AM

అన్‌స్టాపబుల్ విత్ NBK షో ప్రోమోతోనే దుమ్ములేపిన బాలకృష్ణ.. ట్రేండింగ్ లో ఉన్న బాలకృష్ణ షో ఫొటోస్..

నటసింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయ్యారు. బాలయ్య హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఓ టాక్ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షో కు అన్ స్టాపబుల్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు.

సరికొత్త కంటెంట్ చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లను అందిస్తూ విజయవంతగా దూసుకుపోతుంది తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. అంతేకాకుండా.. గేమ్ షోస్.. టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఇతర ఓటీటీ ప్లాట్‌ఫాంలకు గట్టిపోటీనిస్తుంది.

అయితే ఇప్పుడు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు మొదటి గెస్ట్ గా కలక్షన్ కింగ్ మోహన్ బాబు గెస్ట్ గా హారాజారయ్యారు. తాజాగా మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు ఆహా టీమ్.

అన్‌స్టాపబుల్ విత్ NBK పేరుతో ఆయన ఓటీటీ వేదికగా గర్జించనున్నారు. అసలు బాలయ్య ఓటీటీ ఎంట్రీ ఇవ్వడమే ఒక సెన్సేషన్.

బాలయ్య నయా అవతార్‌ను ఆయన ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని రకాల భావోద్వేగాలు ఈ షోలో మిళితం కానున్నాయని ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది.

నందమూరి అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులు సైతం ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

తదుపరి ఎపిసోడ్ల కోసం నందమూని చిన్నోడు ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట.

నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు అంటూ అదిరిపోయే డైలాగ్ తో ప్రోమో మొదలైంది. ఆతర్వాత మోహన్ బాబును ఆహ్వానించారు బాలయ్య.

తనదైన నైజం , మాటలతో మోహన్ బాబును తికమక పెట్టారు బాలయ్య.

ఈ ఇద్దరి మధ్య సంభాషణ చాలా సరదాగా సాగింది. ఇంకా కుర్రాడిలా ఉన్నారేంటి అంటూ బాలయ్య మోహన్ బాబును అడగ్గా.. ఎవరికీ వయసు నీ వయసెంత అని తిరిగి మోహన్ బాబు అడిగారు.. దానికి బాలయ్య 16 ఏళ్ళు అంటూ నవ్వులు పూయించారు.

మోహన్ బాబుతో పాటు విష్ణు, మంచు లక్ష్మీ సైతం ఈ షోలో పాల్గొన్నారు. ప్రోమో అయితే నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
