Syria photo: అతడికి కాలు లేదు.. బాబుకు కాళ్లు, చేతులు లేవు.. అయినా ముచ్చటేస్తున్నారు !సిపా అవార్డ్స్ విన్నర్..(వీడియో)
శిల్పి ఉలి పోట్లను తట్టుకున్న రాయి మాత్రమే అందమైన శిల్పంగా రూపుదిద్దుకుంటుంది. గాయాలను ఆహ్వానించగలిగినవాళ్లే... గేయాలను రచించగలరంటాడో కవి. ఎన్నో గాయాల దుఃఖాల తర్వాతే అసలైన నవ్వుల విలువ తెలుస్తుంది.
శిల్పి ఉలి పోట్లను తట్టుకున్న రాయి మాత్రమే అందమైన శిల్పంగా రూపుదిద్దుకుంటుంది. గాయాలను ఆహ్వానించగలిగినవాళ్లే… గేయాలను రచించగలరంటాడో కవి. ఎన్నో గాయాల దుఃఖాల తర్వాతే అసలైన నవ్వుల విలువ తెలుస్తుంది. ఆ గాయాలన్నీ మరిచి చిద్విలాసాలను చిందించడానికి ఎంతటి సహృదయత కావాలి. యుద్ధనేల సిరియాలో జరిగిన ఓ బాంబుదాడిలో కాలును కోల్పోయాడు మున్జీర్. యుద్ధంలో వెలువడిన నెర్వ్ గ్యాస్‌ని పీల్చుకున్నందుకు కాళ్లు, చేతులు లేని కొడుకు ముస్తఫాకి జన్మనిచ్చింది తల్లి జీనెప్. సిరియాలో యుద్ధం తీసుకెళ్లిపోయిన తమ సంతోషాన్ని వెతుక్కుంటూ సరిహద్దుల్లోని దక్షిణ టర్కీలో స్థిరపడిందా కుటుంబం.
ఓ సంతోష సమయాన ఆ తండ్రీకొడుకుల నవ్వులను క్లిక్‌మనిపించాడు టర్కిష్ ఫొటోగ్రాఫర్ మెహ్మత్ అస్లన్. సియెనా ఇంటర్నేషనల్ ఫొటో అవార్డ్స్ 2021లో ఫొటో ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ‘సిరియాలో ఏం జరుగుతుందో ఈ ఒక్క ఫొటోతో ప్రపంచానికి చూపాలనుకున్నాను’అని చెప్పాడు అస్లన్.
మరిన్ని చదవండి ఇక్కడ: Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

